టాటా సుమో కొత్త లుక్ తో.. కొత్త ఫీచర్స్ తో రీ-ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ సారి SUV మార్కెట్ ను షేక్ చేయడం పక్కా అని అనలిస్ట్ లు అంటున్నారు. తర్వలో జరగబోయే ఆటో ఎక్స్ పో (Auto Expo 2025) వేదికగా లాంచ్ చేస్తారని సమాచారం.
టాటా సుమో కొత్త మోడల్ గురించి ఎక్కువ పబ్లిసిటీ చేయకుండా సైలెంట్ గా లాంచ్ చేసి మార్కెట్ షేక్ చేయాలని టాటా మోటర్స్ కంపెనీ భావిస్తున్నట్లుంది. కొత్త మోడల్ లాంచ్ తో SUV మార్కెట్ లో కస్టమర్స్ కు మరో ఆప్షన్ దొరుకుందని అంటున్నారు.
ఇయితే ఇప్పటి వరకు మహింద్ర XUV 700, స్కార్పియో SUV మార్కెట్ ను ఏలుతున్నాయి. టాటా సుమో న్యూ వర్షన్ వస్తే వీటికి స్ట్రాంగ్ కాంపిటీషన్ తప్పదని అనిపిస్తుంది. అయితే కొత్త మోడల్ పై ఇప్పటి వరకు టాటా మోటర్స్ అధికారిక ప్రకటన చేయలేదు.
1994 లో లాంచ్ అయిన టాటా సుమో.. అప్పట్లో SUV స్పేస్ ను ఆక్యుపై చేసి దాదాపు రెండు దశాబ్దాలు ఏలిందనే చెప్పాలి. 10 సీట్లతో మార్కెట్లో ఎస్ యువి కావాలంటే ముందుగా సుమో నే చూసేవారు కస్టమర్స్. ఇప్పుడు అదే బ్రాండ్ ను అడ్వాన్స్ డ్ ఫీచర్స్ తో ఈ తరం కస్టమర్స్ కు ఎలా కావాలో అలా తీసుకొస్తుంది టాటా మోటర్స్.
స్టన్నింగ్ డిజైన్:
టాటా సుమో అప్డేటెడ్ వర్షన్ లో చాలా మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా వచ్చిన సఫారీ, హారియర్ స్పెసిఫికేషన్స్ కొన్నింటిని కలుపుకొని కొత్త మోడల్ ఉండబోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మోడల్ మరీ అంత ప్రీమియంగా కాకుండా.. అందుబాటు ధరలోనే అడ్వాన్స్ డ్ ఫీచర్స్ తో ఉంటుందని అంటున్నారు.
కొత్త మోడల్ లో బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ DRL తో కూడిన LED headlights, 20 ఇంచుల వీల్స్, రేర్ (బ్యాక్) లుక్ షార్ప్ LED లైట్స్ తో స్మూత్ లుక్స్ తో ఉంటుందట.
కంఫర్ట్ ఇంటీరియర్.. ఫుల్ సేఫ్టీ:
ఇంటీరియర్ చాలా ప్రీమియంగా ఉంటుందట కొత్త సుమోలో. 5 నుంచి 7 మంది కూర్చునే సీటింగ్ కెపాసిటీతో.. డిజిటల్ క్లస్టర్, లార్జ్ టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం.. మొదలైన అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో రానుంది ఈ నయా సుమో.
సేఫ్టీ విషయంలో 6 ఎయిర్ బ్యాగులు, డ్రైవర్ అసిస్టెన్స్ ( Advanced Driver Assistance System (ADAS)), యాంటీ లాక్ బ్రేకింగ్ (Anti Lock Braking System with EBD), బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్స్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.
రఫ్ అండ్ టఫ్ SUV గా.. డీజిల్, పెట్రోల్ ఇంజిన్స్ తో వస్తుంది ఈ అప్డేటెడ్ మోడల్. ఈ మోస్ట్ అవెయిటెడ్ మాడల్ ధర రూ.12 లక్షల నుంచి 14 లక్షల వరకు ఉంటుందట. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే జవనరి 17, 18 న జరిగే ఆటో ఎక్స్ పో వరకు ఆగాల్సిందే.