గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ఛీఫ్ గెస్ట్..?

గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ఛీఫ్ గెస్ట్..?

ఆర్.ఆర్.ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఈసారి గేమ్ ఛేంజర్ సినిమాతో సోలో హీరోగా అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్జే సూర్య, సునీల్, శ్రీకాంత్, అంజలి తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. 

ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్లోబల్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ శురూ చేశారు. ఇందులో భాగంగా చెన్నై, ముంబై, కొచ్చి, తదితర నగరాలతోపాటూ హైదరాబాద్ లో భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. 

ALSO READ : PV Sindhu Wedding: పెళ్లి తర్వాత హల్దీ ఫంక్షన్ ఫోటోలు షేర్ చేసిన పివి సింధు..

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగా ఇప్పటికే సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే ఈవెంట్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చేందుకు మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 

అయితే రామ్ చరణ్ కుటుంబానికి రేవంత్ రెడ్డి తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే సీఎం రేవంత్ ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించనినట్లు తెలుస్తోంది. మరి సీఎం రేవంత్  ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.