రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకమా? అనుకూలమా? కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలి

కరీంనగర్, వెలుగు: అయోధ్యలో రామ మంది ర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమా.. అనుకూలమా? సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సం జయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కరీం నగర్‌‌లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) విస్తరణ కేంద్రాన్ని ఆయన సం దర్శించారు. ఈ సందర్భంగా నూతన భవన నిర్మాణం, తరగతి గదులు, వర్క్ షాప్‌ను పరిశీ లించి, సీఐటీడీ విస్తరణపై అధికారులతో భేటీ అయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.20.40 కోట్లతో నిర్మించిన సీఐటీడీ విస్తరణ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతి ష్ఠాపన కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించ డం సిగ్గు చేటన్నారు. రామ మందిరం స్థా నంలో బాబ్రీ మసీదును నిర్మిస్తే కాంగ్రెస్ నేతలు వెళ్లేవారేమోనని ఎద్దేవా చేశారు. ప్రొటెం స్పీకర్‌‌గా అక్బరుద్దీన్ ని నియమిం చినప్పుడే కాంగ్రెస్ వైఖరి అర్థమైందని గుర్తుచేశారు.