World Cup 2023: ఈ ముగ్గురు ఆటగాళ్ల క్రికెట్ జీవితం ముగిసిందా.. ?

World Cup 2023: ఈ ముగ్గురు ఆటగాళ్ల క్రికెట్ జీవితం ముగిసిందా.. ?

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి  వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాజాగా 15 మందితో కూడిన భారత్  వరల్డ్ కప్ స్క్వాడ్ వచ్చేసింది. ఆసియా కప్ లో ప్రకటించిన 17 మంది స్క్వాడ్ నుంచి ప్రసిద్ కృష్ణ, తిలక్ వర్మను తప్పించి మిగిలిన 15 మందిని వరల్డ్ కప్ కి సెలక్ట్ చేసారు. ఇదిలా ఉండగా సీనియర్ ప్లేయర్ల వైపు సెలక్టర్లు ఆసక్తి చూపించలేదు. దీంతో ఇప్పుడు టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఐసీసీ టోర్నీలో ధావన్ టాప్:  

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కి ఆసియా కప్ లో చోటు దక్కని సంగతి తెలిసిందే. ఓపెనర్ గా భారత విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన ధావన్ కి తాజాగా వరల్డ్ కప్ లో కూడా చెక్ పెట్టారు సెలక్టర్లు. ఐసీసీ టోర్నీలో మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న ఈ ఢిల్లీ బ్యాటర్.. వరల్డ్ కప్ లో చోటు దక్కుతుందని  భావించినా నిరాశే ఎదురైంది. దీంతో ధావన్ కెరీర్ దాదాపుగా ముగిసినట్టుగానే కనిపిస్తుంది.  అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధవన్‌ను జట్టుకు ఎంపిక చేసే ఆలోచనలేదని తెలిపాడు.

రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌లను ఓపెనర్లుగా పరిగణిస్తున్నామని ఇదివరకే సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. దీంతో ధావన్ ని వరల్డ్ కప్ కి సెలక్ట్ చేయడం లేదని చెప్పకనే చెప్పేసాడు. సీనియర్ ప్లేయర్ గా ధావన్ జట్టులో ఉంటే కలిసొచ్చే విషయమే. ధావన్ అనుభవంతో పాటు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ అదనపు బలం. పైగా ఐసీసీ టోర్నీలో మంచి రికార్డ్ ఉండడంతో పాటు ఒత్తిడిని కూడా అధిగమించగలడు.

ALSO READ :వన్డే వరల్డ్ కప్ ఆడే.. టీమిండియా ఆటగాళ్లు వీళ్లే..
 
అశ్విన్ కి ఛాన్స్ ఎక్కడ..?

స్వదేశంలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు స్పిన్నర్లకు అనుకూలిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ భారత్ జట్టు అనూహ్యంగా కేవలం ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ ని మాత్రమే ఎంపిక చేసింది. కుల్ దీప్ యాదవ్ తో పాటు అశ్విన్ ని తీసుకుంటే అశ్విన్ అనుభవం జట్టుకి చాలా ఉపయోగపడుతుంది. పైగా అశ్విన్ చాలా ఇంటెలిజెంట్ బౌలర్. ఇంత సీనియర్ బౌలింగ్ ని పక్కన పెట్టడం భారత్ కి ప్రతికూలమే.

భువీ పనికిరాడా..?

స్వింగ్ బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. పవర్ ప్లే లో భువిని ఆడటం ప్రత్యర్థులకు పెద్ద సవాలే. నకుల్ బాల్ తో యార్కర్లతో ఈ సీనియర్ బౌలర్ మ్యాజిక్ చేయగలడు. ఆసియా కప్ ఓ సెలక్ట్ చేయకపోయినా వరల్డ్ కప్ కి ఈ బౌలర్ మీద నమ్మకం ఉంచుతారని ఫ్యాన్స్ భావించినా.. భువిని దురదృష్టం వెంటాడింది. భువి లాంటి బౌలర్ ని పక్కన పెట్టడం భారత్ కి కొంత నష్టం తప్పకపోవచ్చు.

ముగ్గురి కెరీర్ క్లోజ్

వరల్డ్ కప్ లో సెలక్ట్ కాకపోవడంతో ఈ ముగ్గురు ఇక భవిష్యత్తులో టీమిండియా పరిమిత ఓవర్ల కెరీర్ ముగిశాయనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అశ్విన్ టెస్టు మ్యాచులు ఆడుతుండగా.. భువి, శిఖర్ ధావన్ కి మాత్రం ఒక్క ఫార్మాట్ లో కూడా చోటు దక్కించుకోలేకపోతున్నారు. కుర్రాళ్ళ మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో తిరిగి టీమిండియా తలుపులు తట్టడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది.