‘సర్కారు వారి పాట’ ఫస్ట్ షాట్ ఫారిన్‌ లో..?

‘సర్కారు వారి పాట’ ఫస్ట్ షాట్ ఫారిన్‌ లో..?

కరోనా ఎఫెక్ట్‌‌తో సినిమాల షూటింగ్ షెడ్యూల్సే కాదు..  లొకేషన్స్ కూడా మారుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో షూటింగ్ చేయాలనుకున్న షెడ్యూల్స్‌‌కి మరో ఆప్షన్ వెతుక్కుంటున్నారు. అయితే మహేష్‌ బాబు సినిమా మాత్రం ముందు అనుకున్న ప్రకారం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోనుందట. పైగా ఫారిన్ షెడ్యూల్‌‌తో నే షూటింగ్ స్టార్ట్ అవబోతుందని తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో జరిగే స్కాముల బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ సినిమా ఉంటుంది. లోకల్ బ్యాంక్స్‌‌ని మోసం చేసి ఫారిన్‌‌లో దాక్కున్న విలన్‌‌ని ఇండియాకి రప్పించే హీరోగా మహేష్ కనిపిస్తాడని టాక్. దీంతో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తు పరిస్థితుల్లో ఈ షెడ్యూల్ ఉండకపోవచ్చట. కానీ అమెరికా షెడ్యూల్‌‌ మాత్రం మస్ట్ అని, పరిస్థితులు కాస్త చక్కబడ్డాక వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాదు.. ఈ షెడ్యూల్‌‌తో నే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. నెల రోజుల పాటు అక్కడ షూట్‌‌ చేశాక.. నెక్స్ట్ షెడ్యూల్‌‌ ఇక్కడికొచ్చి తీస్తారని సమాచారం. హీరోయిన్‌‌గా కీర్తి సురేష్‌ పేరు వినిపిస్తోంది. అఫీషియల్‌‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్‌ కి చెందిన జీఎంబీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్‌‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్‌‌, 14 రీల్స్ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.