Naga Chaitanya-Sobhita wedding: రూ.50 కోట్లకి నాగ చైతన్య, శోభిత వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్.. నిజమేనా..?

Naga Chaitanya-Sobhita wedding: రూ.50 కోట్లకి నాగ చైతన్య, శోభిత వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్.. నిజమేనా..?

Naga Chaitanya-Sobhita wedding: టాలీవుడ్ ప్రముఖ హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరి వివాహం డిసెంబర్ 04న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే నాగ చైతన్య వివాహానికి బంధువులు సన్నిహితులతోపాటూ బాలీవుడ్, టాలీవుడ్ తదితర సినీ పరిశ్రమలనుంచి పెద్దలు, స్నేహితులు హాజరవుతున్నట్లు సమాచారం. 

నాగ చైతన్య, శోభిత పెళ్ళి స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటిటి నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు పలువార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ దాదాపుగా రూ.50 కోట్లు బడ్జెట్ వెచ్చించినట్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కానీ నాగచైతన్య ఫ్యామిలీ మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. దీంతో నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ పై వినిపిస్తున్న వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

అయితే బాలీవుడ్ లో పెళ్ళి స్ట్రీమింగ్ రైట్స్ అమ్మే ట్రెండ్ మొదలైంది, ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది సినీ సెలెబ్రెటీలు తమ పెళ్ళి స్ట్రీమింగ్ రైట్స్ అమ్మి వందలకోట్లు గడించారు.

ఈ విషయం ఇలా ఉండగా గతంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ పెళ్ళి స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ రూ.120 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ పెళ్లి స్టీమింగ్ రైట్స్ కోసం దాదాపుగా రూ.25 కోట్లు ఇచ్చారు. ఇటీవలే "నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్" అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ని  నెట్ఫ్లిక్స్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి డిస్నీ+హాట్ స్టార్ దక్కించుకుంది. దీనికోసం దాదాపుగా రూ.80 కోట్లు బడ్జెట్ వెచ్చించారు. వీళ్ళే కాకుండా దీపికా పదుకునే-రణవీర్ సింగ్ (రూ.120 కోట్లు), రణబీర్ కపూర్-అలియా భట్ (రూ.100 కోట్లు ), ప్రియాంక చోప్రా-నిక్ జోన్స్ ($2.5 మిలియన్లు) పెళ్ళిళ్ళ స్ట్రీమింగ్ రైట్స్ కోసం దాదాపుగా వందల కోట్లు వెచ్చించి నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది.