వక్ఫ్ బోర్డా.. ల్యాండ్ మాఫియా బోర్డా?: యోగి ఆదిత్యనాథ్

వక్ఫ్ బోర్డా.. ల్యాండ్ మాఫియా బోర్డా?: యోగి ఆదిత్యనాథ్

వక్ఫ్ బోర్డ్.. ల్యాండ్ మాఫియా బోర్డులా మారిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. దేశంలో ఎక్కడ ఖాళీ భూమి కనిపిస్తే దాన్ని కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రయాగ్​రాజ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘మేము యూపీలో మాఫియాను నామరూపల్లేకుండా చేశాం. వక్ఫ్ బోర్డు ఆగడాలకు కళ్లెం వేశాం. లోక్​సభలో చట్టం ఆమోదం పొందినందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​షాకు ధన్యవాదాలు. రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం పొంది చట్టం అవుతుంది. 

ఇక నుంచి వక్ఫ్​ బోర్డు ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే నడ్వదు’’ అని యోగి అన్నారు.