ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‍లో బలమైన జట్టు ఏది అంటే.. టీమిండియా(Team India). అందుకే పాక్ జర్నలిస్టుల కన్ను మనదేశంపై పడింది. వివాదస్పద వ్యాఖ్యలు, ట్వీట్లు చేస్తూ భారత క్రికెట్‌లో గొడవలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటారా? క్రిక్‌డెన్ (Cricden) ఫౌండర్, పాకిస్తాన్ జర్నలిస్ట్ ఫరీద్ ఖాన్.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. కోహ్లీపై జట్టులో కుట్ర జరుగుతోందన్నది ఆ ట్వీట్ సారాంశం. అసలు ఓ పాక్ జర్నలిస్ట్.. భారత క్రికెట్ గురుంచి ఎందుకు స్పందించారు? కోహ్లీనే ఎందుకు టార్గెట్ చేశారు? అన్నది అంతుపట్టని విషయం.
రెండు, మూడో వన్డేల్లో కోహ్లీకి నో ఛాన్స్
వెస్టిండీస్‌తో ముగిసిన మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో కోహ్లీ ఒక మ్యాచులో మాత్రమే బరిలోకి దిగారు. తొలి వన్డేలో అవకాశమొచ్చినా.. ఆ తరువాత రెండు మ్యాచుల్లో బెంచ్‌కే పరిమితమయ్యారు. విశ్రాంతి పేరుతో టీం మేనేజ్మెంట్ అతన్ని పక్కన పెట్టింది. అలా అని కోహ్లీ ఒక్కరే కాదు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం బెంచ్‌కే పరిమితమయ్యారు. వన్డే ప్రపంచ కప్ 2023 సన్నద్ధత కోసం టీం మేనేజ్మెంట్.. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించి వారిని పరీక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి విశ్రాంతినిచ్చారు. ఇది అర్థం చేసుకొని పాక్ జర్నలిస్ట్.. కోహ్లీపై జట్టులో కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
అతని ఆరోపణలు ఏంటంటే?
ఈ ఏడాది స్వదేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్.. కోహ్లీకి చివరిదన్న మాటలు వినపడుతున్నాయి. ఈ టోర్నీలో భారత జట్టును విజేతగా నిలిపి.. కెరీర్‌ను విజయవంతంగా ముగించాలని విరాట్ ఆలోచిస్తున్నారట. అదే నిజమైతే పాక్ జర్నలిస్ట్ ఆరోపణలు నిజమే అనుకోవాలి.
సచిన్ టెండూల్కర్.. 49
వన్డే ఫార్మాట్‌లో 49 సెంచరీలతో సచిన్ అగ్రస్థానాలో ఉండగా.. కోహ్లీ 46 శతకాలతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ సమయంలో అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తే నాలుగు సెంచరీ పూర్తి చేసి 50 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా అవతరిస్తారు. కానీ కోహ్లీ ఆ రికార్డును చేరుకోకుండా.. బీసీసీఐ అడ్డుపడుతోందన్నది అతని ఆరోపణ.
విండీస్‌తో ముగిసిన ఆఖరి వన్డేలో కోహ్లీ లేరని తెలియగానే ఫరీద్ ఖాన్.. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై, టీం మేనేజ్మెంట్‌పై విషం చిమ్మే ప్రయత్నం చేశారు. " విరాట్ కోహ్లీపై కొందరు అభద్రతాభావంతో ఉన్నారు. 50 వన్డే సెంచరీల రికార్డును అతడు చేరుకోకూడదన్నదే వారి ఆలోచన. అందుకు సిగ్గుపడాలి. ఈ విషయంలో బీసీసీఐ తీరు సరికాదు. అతను జట్టు కంటే గొప్పవాడు.." అని ట్వీట్ చేశారు.
They are insecure of Virat Kohli, they aren't letting him break the record of 50 ODI hundreds. Shameful decision to rest him again.
— Farid Khan (@_FaridKhan) August 1, 2023
BCCI, this isn't done. Kohli is bigger than this team ? #WIvIND pic.twitter.com/yXnHAzueDx
కోహ్లీ ప్రతి మ్యాచులో బరిలోకి దిగాలని.. అతడు ఆశించింది నిజమైనా, అతని ట్వీట్ మాత్రం భారత అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇలాంటి చెత్త వాగుడు మానుకొని పాకిస్తాన్ క్రికెట్ జట్టు సమస్యలపై ద్రుష్టి పెట్టాలని నెటిజన్స్ అతనికి బుద్ధి చెప్తున్నారు.