శ్రీకాంత్ ఓదెల సినిమాలో నాని కి తండ్రిగా మెగాస్టార్ చిరు... నిజమేనా.?

శ్రీకాంత్ ఓదెల సినిమాలో నాని కి తండ్రిగా మెగాస్టార్ చిరు... నిజమేనా.?

గత ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మళ్ళీ అదే హిట్ కాంబో ని రిపీట్ చేస్తున్నాడు. ఇందులోభాగంగా హీరో నానితో ది ప్యారడైస్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.  దసరా సినిమాని నిర్మించిన ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

అయితే టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవి సినిమా విషయమై సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ది ప్యారడైస్ సినిమాలో కామియో రోల్ కోసం చిరు కి స్టోరీ వినిపించగా ఒకే చెప్పినట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా చిరు హీరో నాని తండ్రి పాత్రలో నటిస్తున్నాడని, అలాగే ఈ పాత్ర ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో దాదాపుగా 20 నిమిషాలు ఉంటుందని టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

మరికొందరు మాత్రం శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ తో సోలో సినిమా ప్లాన్ చేస్తున్నాడని అందుకే స్టోరీ నెరేషన్ సిట్టింగ్ లో పాల్గొని కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది సెప్టెంబర్ లో శ్రీకాంత్ ఓదెల సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో టాలెంట్ నిరూపించుకోవడంతో మెగాస్టార్ సినిమా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ చిరు, శ్రీకాంత్ ఓదెల సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.