Health tips:మీ ఇంట్లోని పసుపులో కల్తీని ఇలా కనిపెట్టొచ్చు..!

Health tips:మీ ఇంట్లోని పసుపులో కల్తీని ఇలా కనిపెట్టొచ్చు..!

పసుపు..దీనికి వంటింటి దినుసుల్లో బంగారు అంత విలువ ఉంది. పసుపు లేకుండా వంటకాలను ఊహించుకోవడం చాలాకష్టం. యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటిఆక్సిడెంట్స్​ లక్షణాలున్న పసుపు ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్​ అనే ఒకరకమైన కాంపోనెంట్ మెదడు ఫంక్షనింగ్​మెరుగుపర్చి బ్రెయిన్​ డ్యామేజీనుంచి రక్షిస్తుంది. అంతేకాదు లివర్​ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తుంది. తద్వారా లివర్​ డ్యామేజీని కట్టడిచేస్తుంది.

అయితే ఎన్నో ఆరోగ్యకరమైన లక్షణాలున్న పసుపు కల్తీ అవుతోంది. మార్కెట్లో ప్యాకేజ్డ్​పసుపు రంగులు కలిపి కల్తీ చేస్తున్నారు. ఒరిజినల్​ పసుపు వాసన కలర్ రావడానికి కెమెకల్స్​కలుపుతున్నారు. ప్రముఖ పసుపు బ్రాండ్​ కంపెనీలు కూడా కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇవేగనక రెగ్యులర్ గా తింటే ప్రాణాల మీదకు తెచ్చుకన్నట్లే..ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

ALSO READ | Health Tips: మసాలా మెడిసిన్​!

స్థానికంగా పసుపును పండించడం గానీ, లోకల్​ రైతులను పసుపు పంట వేయడంలో ప్రోత్సహించడం గానీ చేస్తే పసుపు కల్తీని అడ్డుకోవచ్చుం టున్నారు కల్తీ గురించి ఆందోళన చెందుతున్నవారంతా. స్వయంగా ఇంటివద్దే ముడి పసుపును శుభ్రం చేసుకొని, ఎండబెట్టి, గ్రైండ్ చేసుకుంటే పసుపులో ఉండే ఆయుర్వేద, ఆరోగ్యకరమైన లక్షణాలు అలాగే ఉంటాయంటున్నారు. 

పసుపు కల్తీని ఎలా గుర్తించాలంటే..

లాభాలే లక్ష్యంగా ప్రస్తుతం మార్కెట్లో దొరికే పసుపును వ్యాపారులు ఆర్టిఫిషియల్​కలర్లతో కల్తీ చేస్తున్నారు.  పసుపు పొడి తరచుగా కృత్రిమ రంగులు, మెటానిల్ పసుపు, సీసం, క్రోమేట్, సుద్ద పొడి, అడవి పసుపుతో కల్తీ చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి ఇక్కడ కొన్ని సాధారణ పరీక్షలు ఉన్నాయి.

లీడ్ క్రోమేట్ పరీక్ష

ఒక టీస్పూన్ పసుపు పొడిని నీటితో కలపండి. పౌడర్​ నీటి అడుగుభాగానికి చేరి నీరు లేత పసుపు రంగులోకి చేరితే ఆ పసుపు స్వచ్ఛమైనది. కల్తీ పసుపు అయితే నీరు మొత్తం పసుపు రంగులోకి మారుతుంది. 

మెటానిల్ పరీక్ష

ఒక టెస్ట్​ ట్యూబ్​ లో చిటికెడు పసుపు వేసి కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్​ ఆమ్లం వేయాలి. మిశ్రమం గులాబీ రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. మెటానిల్ కెమికల్ ఫుడ్​ పాయిజనింగ్​, కడుపు నొప్పి, వికారం, అజీర్ణానికి దారితీస్తుంది. 

స్టార్చ్ పరీక్ష

వేడినీటిలో ఒక చుక్క అయోడిన్​ ద్రావణం వేసి మిశ్రమానికి టీ స్పూన్​ పసుపు పొడిని కలపండి. మిశ్రమం నీలం రంగులోకి మారితే స్టార్చ్​ తో పసుపు కల్తీ అయిందని గుర్తించాలి. మీకు పసుపు కల్తీ అయిందని అనుమానం వస్తే ఇలా చెక్​ చేసి పసుపు మంచిదో కాదో తెలుసుకోండి. బీ కేర్​ఫుల్​..