డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ వెర్షన్ లో ఆ హీరోయిన్ సీన్స్ డిలీట్ చేశారా..?

డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ వెర్షన్ లో ఆ హీరోయిన్ సీన్స్ డిలీట్ చేశారా..?

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్బి బాబీ డియోల్, చాందిని చౌదరి, ప్రదీప్ రావత్, సచిన్ ఖేడేకర్, షైన్ టామ్ చాకో, విశ్వంత్ దుడ్డుంపూడి, ఆడుకలం నరేన్ మరియు రవి కిషన్తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి దాదాపుగా రూ. 175 కోట్లు కలెక్ట్ చేసింది. 

అయితే డాకు మహారాజ్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈక్రమంలో డాకు మహారాజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ వెర్షన్ లో నటి ఊర్వశి రౌటేలా కి సంబందించిన సీన్స్ తొలగించారని అందుకే ప్రమోషన్స్ పోస్టర్ లో నుంచి కూడా ఊర్వశి ఫోటోని తొలగించారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకూ మేకర్స్ స్పందించకపోవడంతో ఈ వార్తలో నిజమెంతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ఓటిటి రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వార్తలు రావడంవల్ల నార్త్ ఆడియన్స్ వ్యూస్ పై ప్రభావం ఉంటుందని కొందరు అంటున్నారు.

నటి ఊర్వశి రౌటేలా విషయానికొస్తే ఈ సినిమాలో దబిడి దిబిడి స్పెషల్ సాంగ్ లో నటించింది. అలాగే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. కానీ ఊర్వశి పాత్రకి సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ దబిడి దిబిడి పాటకి గ్లోబల్ వైడ్ గా రెస్పాన్స్ వచ్చింది.