చిరంజీవి "విశ్వంభర" సినిమాలో మెగా మేనల్లుడు గెస్ట్ రోల్ చేస్తున్నాడా..?

చిరంజీవి "విశ్వంభర" సినిమాలో మెగా మేనల్లుడు గెస్ట్ రోల్ చేస్తున్నాడా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభర. ఈ సినిమాకి బింబిసారా మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ అయితే ఇప్పటికే ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. కానీ పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అంతేకాదు ఏకంగా సీజీ వర్క్స్ విషయంలో ట్రోల్స్ కూడా జరిగాయి. దీంతో గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయ్యింది. 

అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరుతోపాటు మెగా ఫ్యామిలీలోని మరో స్టార్ హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ లేదా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గెస్ట్ రోల్ ఉంటుందని సమాచారం. కానీ ఈ ఇద్దరిలో ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. అయితే గతంలో సాయి దుర్గ తేజ్ రీమేక్ చేసిన బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా నటించాడు. దీంతో ఈసారి చిరుతో కలసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా వరుణ్ తేజ్ కి ఉన్నయాని కొందరు మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Also Read : మొనాలిసాకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన బిజినెస్ మెన్

ఈ విషయం ఇలా ఉండగా విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇటీవలే దసరా మూవీ ఫేమ్ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాని నేచురల్ స్టార్ నానీ నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకూడా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.