
దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో సినిమా కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ప్రముఖ హీరోయిన్, ప్రొడ్యూసర్ చార్మ్ నిర్మిస్తోంది. ఇటీవలే ఉగాది సందర్భంగా ఈ సినిమాని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే పలువురు టాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరీని హీరో విజయ్ సేతుపతి సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేశాడు. దీంతో పూరి జగన్నాథ్ కూడా ఈసారి స్టెర్న్గ్ కంబ్యాక్ ఇవ్వాలని బాగానే ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియన్ లెవల్‌లో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం.
అయితే తాజాగా విజయ్ - పూరి జగన్నాథ్ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కోసం వెటరన్ హీరోయిన్ టబు ని తీసుకురానునట్లు టాక్ వినిపిస్తోంది. టబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఆమధ్య నటి టబు తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల. వైకుంఠపురంలో సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ టబు తెలుగులో నటించలేదు.
పూరి-విజయ్ టైటిల్:
పూరి-విజయ్ కాంబోలో రానున్న సినిమాకు ఈ సినిమాకు 'బెగ్గర్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అంతేకాదు తెలుగు, తమిళ భాషలకు సూటయ్యేలా ఈ టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ ఏప్రిల్ నెలాఖరున లేదా మే నెలలో ఈ మూవీ లాంఛ్ కానున్నట్లు సమాచారం. ఇకపోతే, రెగ్యూలర్ డ్రగ్స్ నేపథ్యంలో కాకుండా క్రైమ్‌తో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్‌ని పూరి రూపొందిస్తున్నట్లు మరో టాక్ కూడా ఉంది.