హీరో భార్య డెత్ మిస్టరీ : 16 కిలోలు త‌గ్గింది.. గుండెపోటు వ‌చ్చింది

హీరో భార్య డెత్ మిస్టరీ  :  16 కిలోలు త‌గ్గింది.. గుండెపోటు వ‌చ్చింది

బరువు తగ్గటమే ఆమెకు శాపం అయ్యిందా.. బరువు తగ్గటం వల్లే గుండెపోటు వచ్చిందా.. ఒక్కసారిగా.. నాలుగు నెలల్లో 16 కిలోల బరువు తగ్గటానికి చేసిన కసరత్తులు.. డైటింగ్ వల్లే చనిపోయిందా.. ఇప్పుడు ఇదే సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది. కన్నడ హీరో, దర్శకుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మరణం వెనక ఇప్పుడు రకరకాల కారణాలపై చర్చ నడుస్తుంది.  స్పందన కొంచెం బొద్దుగా.. లావుగా ఉంటుంది. అయితే బరువు తగ్గాలి.. స్లిమ్ గా మారాలనే ఉద్దేశంతో.. నాలుగు నెలల నుంచి డైటింగ్ చేస్తుంది. 

ఈ క్రమంలోనే 16 కిలోల బరువు తగ్గింది. దీని వల్లే ఇప్పుడు గుండెపోటు వచ్చి చనిపోయినట్లు ఆ కుటుంబ సభ్యుల్లో చర్చజరగటం విశేషం. ఆరోగ్యం, ఆహారం విషయంలో మొదటి నుంచి స్పందన ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని.. అలాంటి మనిషికి ఒక్కసారిగా తీవ్ర గుండెపోటు రావటం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఒక్కసారిగా భారీగా తగ్గిన బరువు వల్లే.. గుండెపోటు వచ్చినట్లు కూడా కొందరు చెప్పటం విశేషం.  

భర్త,అక్కాచెల్లెళ్లతో కలిసి హాలిడేను ఎంజాయ్ చేస్తున్న స్పందనకు షాపింగ్ ముగించుకుని హోటల్ గదికి వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే స్పందన చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆమె డెడ్ బాడీ ఇవాళ బెంగళూరుకు చేరుకోనుంది.  

విజయ రాఘవేంద్ర-, స్పందన ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.   2007ఆగస్టు  26 నవివాహం చేసుకున్నారు.  వీరిద్దరికీ శౌర్య అనే కొడుకు ఉన్నాడు.   వీరి 16వ వివాహ వార్షికోత్సవానికి మరో19 రోజుల ముందు ఈ విషాదం చోటుచేసుకుంది. రిటైర్డ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ బీకే శివరామ్ కుమార్తె స్పందన. విజయ్ రాఘవేంద్ర  కన్నడ సినిమాల్లో నటుడిగా దర్శకుడిగా కొనసాగుతున్నారు.  2016లో విడుదలైన అపూర్వ సినిమాలో స్పందన అతిథి పాత్రలో నటించింది.