Spirit movie updates: ప్రభాస్ కి విలన్ గా సందీప్ రెడ్డి ఆ కోలీవుడ్ హీరోని దింపుతున్నాడా.?

Spirit movie updates: ప్రభాస్ కి విలన్ గా సందీప్ రెడ్డి ఆ కోలీవుడ్ హీరోని దింపుతున్నాడా.?

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ తో "స్పిరిట్" అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫిసర్ పాత్రలో కనిపించనున్నాడు. స్పిరిట్ సినిమాని సందీప్ రెడ్డి భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉండటంతో సందీప్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా మొదలు పెట్టాడు. ఇందులోభాగంగా క్యాస్ట్ అండ్ క్రూ ని సెట్ చేసే పనిలో పడ్డాడు. 

అయితే స్పిరిట్ లో ప్రభాస్ కి విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే విజయ్ కి సందీప్ రెడ్డి స్పిరిట్ స్టోరీ వినిపించగా విజయ్ కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. స్పిరిట్ షూటింగ్ జూన్ లో మొదలు కానుంది. దీంతో 90 రోజుల పాటూ ముంబై, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో షూటింగ్ చెయ్యనున్నారు. అయితే స్పిరిట్ లో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నట్లు రూమర్లు రావడంతో సోషల్ మీడియాలో అప్పుడే హైప్ మొదలైంది. 

ALSO READ | రష్మిక లైఫే మారిపోయిందిగా.. ఆమె ఏడాది సంపాదన ఎంతో తెలిస్తే.. తోటి హీరోయిన్లు కుళ్లుకోవాల్సిందే..!

ఎందుకంటే విజయ్ సేతుపతి గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్(పెట్ట), షారుఖ్ ఖాన్ (జవాన్), వైష్ణవ్ తేజ్ (ఉప్పెన), కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (మాస్టర్) తదితర స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటించాడు. ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి విజయ్ తో సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ స్పిరిట్ లో విజయ్ విలన్ గా చేస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే విజయ్ సేతుపతి నటించిన మహారాజ, విడుదలై పార్ట్ 2 (తెలుగులో విడుదల 2), సినిమాలు బీగానే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి భాషతో సంబంధం లేకుండా అన్ని సినీ పరిశ్రమల్ని కవర్ చేస్తూ నటిస్తున్నాడు.