Good Health : తెల్ల గుడ్డు మంచిదా.. గోధుమ రంగు గుడ్లు మంచివా.. బర్డ్ ఫ్లూ టైంలో ఏది తింటే బెస్ట్..!

Good Health : తెల్ల గుడ్డు మంచిదా.. గోధుమ రంగు గుడ్లు మంచివా.. బర్డ్ ఫ్లూ టైంలో ఏది తింటే బెస్ట్..!

గుడ్లు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా 3 వంటి విటమిన్లు కూడా లభ్యం అవుతాయి. ఈ పోషకాలు ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తాయి. గుడ్లు తింటే ఒత్తిడి తగ్గడంతో పాటు నిద్ర మెరుగుపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అలాగే.. బరువు తగ్గడంలోనూ గుడ్లు సహయ పడుతాయి. అయితే.. గుడ్లు తినేవారిలో ఒక సందేహాం మెదులుతోంది. గుడ్లలో రెండు రకాలు చాలా రకాలు ఉంటాయి. ఇందులో తెల్ల గుడ్డు, గోధుమ రంగు గుడ్లను ప్రజలు ఎక్కువగా వాడుతుంటారు. అయితే.. తెల్ల గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదా..? లేక గోధుమ రంగు గుడ్డు తింటే హెల్త్‎కు లాభమా అన్న దానిపై కొందరికి డౌట్లు ఉన్నాయి. దీనిపై హెల్త్ ఎక్స్‎పర్ట్స్ ఏం చెబుతున్నారో చూద్దాం..

గోధుమ రంగు,  తెల్ల గుడ్ల మధ్య తేడా

గోధుమ రంగు గుడ్లను దేశీ గుడ్లు అంటారు. తెల్ల గుడ్డును పౌల్ట్రీ గుడ్డు అంటారు. తెల్ల గుడ్లలో ప్రోటీన్ ఉంటుంది. గోధుమ రంగు గుడ్లలో ప్రోటీన్‌తో పాటు కాల్షియం, కేలరీలు కూడా ఉంటాయి. తెల్ల గుడ్లలో గోధుమ రంగు గుడ్ల కంటే కాస్త తక్కువగా ప్రోటిన్ ఉంటుంది. కానీ ఇవి రెండు రకాల గుడ్లు  ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గోధుమ రంగు గుడ్డులో తెల్ల గుడ్డు కంటే ప్రోటీన్, కాల్షియం, కేలరీలు కొంచెం ఎక్కువగా ఉండటంతో.. ఈ గుడ్డుకు కొంచెం ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే.. గోధుమ రంగు గుడ్డు లోపల పసుపు భాగం తెల్ల గుడ్డులోని పసుపు భాగం కంటే కొంచెం ముదురు రంగులో ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ పోషకమైనదిగా పరిగణించబడుతుంది. 

సో.. తెల్ల గుడ్డు కంటే.. గోధుమ రంగు గుడ్డు బెటర్ అని కొందరు ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కోళ్ల ఫామ్‎లలో పెంచుతున్న కోళ్లపై బర్డ్ ఫ్లూ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. బర్డ్ ఫ్లూ సోకి కోళ్ల ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తెల్ల గుడ్లు కోళ్ల ఫారాల్లో పెంచే కోళ్ల నుంచే వస్తుండటంతో బర్డ్ ఫ్లూ సమయంలో వాటిని తినకపోవడమే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుడ్డు లేని ఉండలేని వారు తెల్ల కోడి గుడ్డు కంటే.. దేశీ కోడి గుడ్లను తినడం మంచిదని సూచిస్తున్నారు. 

గుడ్లు కొనేటప్పుడు ఈ చిట్కాలను ఫాలో అవ్వండి:

  • గుడ్లను ఎంచుకునేటప్పుడు వాటి ఆకారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి
  • శుభ్రమైన, పగలని గుడ్లను తీసుకోండి
  • ఎక్కువ కాలం నిల్వ ఉంచిన గుడ్లను కొనకండి
  • గుడ్లు ఎంచుకునేటప్పుడు, వాటి సైజ్‎ను చూడండి.
  • గుడ్లు కొన్న తర్వాత చల్లని ప్రదేశంలో పెట్టండి