
ఈ మధ్య ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇచ్చిన షాక్ కు దేశం అంతా షేక్ అయ్యింది. ఫారెన్ ఎక్స్ చేంజ్ (ఫోరెక్స్) పోర్ట్ ఫోలియో డెరివేటివ్స్ లో అవకతవకల కారణంగా కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. గత ఫోరెక్స్ (forex) లావాదేవీలను తక్కువగా చేసి చూపించడంతో రూ.1600 నుంచి రూ.2 వేల కోట్ల ఆర్థికంగా తగ్గినట్లయ్యింది. అంటే 2024 డిసెంబర్ లో ఉన్న నెట్ వర్త్ లో 2.35 శాతం పడిపోయింది. దీంతో అక్టోబర్ నెలలో రూ.1280 ఉన్న షేర్ ధర ఏకంగా రూ.666.25 వరకు పడిపోయింది. జనవరి 2024 నుంచి కంపెనీ దాదాపు రూ.78వేల 762 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయింది. ప్రస్తుత మార్కెట్ విలువ రూ.51వేల28 కోట్లుగా ఉంది. అంటే దాదాపు 79 వేల కోట్ల రూపాయలు నష్టపోయింది.
అప్పట్లో ఎస్ బ్యాంకులో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇలా ఉన్నట్లుండీ బ్యాంకులలో ఫ్రాడ్ జరిగి దివాలా తీస్తే ఏంటి పరిస్థితి. ఆర్బీఐ ఇచ్చే సడలింపుతో కొన్ని బ్యాంకులు చచ్చీ బతికినట్లుగా మనగలిగినా పూర్వ వైభవం వచ్చీ అలాంటి లాభాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇలా జరిగినపుడు ముందుగా ఇన్వెస్టర్లు నష్టపోతారు. ఆ తర్వాత డిపాజిట్ చేసిన సామాన్యులు నష్ట పోతారు.
కాయాకష్టం చేసో, ఉద్యోగాలు, వ్యాపారం చేసో సంపాదించిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక సేఫ్ సైడ్ గా బ్యాంకులో దాచుకోవడం ఇండియన్స్ కు తెలిసిన పని. అలా దాచుకున్న డబ్బు బ్యాంకులు దివాళా తీస్తే ఏంటి పరిస్థితి. బ్యాంకులు తీవ్రంగా నష్టపోయి దివాళా తీస్తే మన డబ్బు మనకు వస్తుందా..? దీనికి ఇన్సురెన్స్ ఏమైనా ఉంటుందా..? ఇది తప్పక తెలుసుకోవాల్సిన విషయం.
డిపాజిట్లకు ఇన్సురెన్స్ ఉంటుందా?
డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (DICGC) అనే రిజర్వ్ బ్యాంకు సబ్సిడరీ సంస్థ.. డిపాజిట్లపై ఇన్సురెన్స్ గ్యారెంటీ ఇస్తుంది. ప్రజలు చేసిన డిపాజిట్లకు గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఇన్సురెన్స్ ఇస్తుంది. బ్యాకు దివాళా తీసినపుడు, బ్యంకు లైసెన్స్ రద్దయినపుడు లేదా ఇతర కారణాలతో బ్యాంకులు ప్రజలకు మూత పడినపుడు 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. అంటే అలాంటి సందర్భాల్లో డబ్బులు ఈ సంస్థ చెల్లిస్తుంది.
Also Read:-పండగే పండగ.. ఐదు రోజులు ఓయో రూమ్స్ ఫ్రీ.. డీటెయిల్స్ ఇవిగో..
ఒకవేళ మీరు 4 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఉంటే.. బ్యాంకు మూత పడే నాటికి లక్షా 50 వేల రూపాయలు వడ్డీ పెరిగి మొత్త రూ.5 లక్షల 50 వేలు మీ బ్యాంకులో ఉంటే.. ఇన్సురెన్స్ 5 లక్షల వరకే ఉంటుంది. అంటే 5 లక్షలు ఇస్తారు. 50 వేలు ఇవ్వరు. ఇలా ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా 5 లక్షలకు మించి ఇన్సురెన్స్ ఉండదు.
ఏ ఏ బ్యాంకులకు వర్తిస్తుంది:
DICGC అన్ని బ్యాంకులకు కవరేజ్ ఇస్తుంది. ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యంకులకు కూడా ఇస్తుంది. కేంద్ర, రాష్ట్ర, పట్టణ కోఆపరేటివ్ బ్యాంకులకు ఇన్సురెన్స్ కవరేజ్ ఉంటుంది. ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీలకు ఇన్సురెన్స్ కవరేజీ ఉండదు.
ఇన్సురెన్స్ పెంచుకోవచ్చా.?
ఇన్సురెన్స్ పెంచడం మన చేతుల్లో ఉండదు. ఆర్థిక మంత్రి, ఆర్బీఐ నిర్ణయంతో పెరుగుతుంది. 2020 లో న్యూ ఇండియా బ్యాంకు దివాళా తీసినపుడు ఇన్సురెన్స్ 5 లక్షలకు పెంచారు. అంతకు ముందు లక్ష రూపాయలే ఉండేది. ప్రస్తుతం 10 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ ఉంది . ఇటీవల బడ్జెట్ సందర్భంగా దీనిపై ప్రశ్నించినపుడు DICGC ప్రభుత్వానికి అభ్యర్థిస్తే అమలులోకి తీసుకువచ్చే చాన్స్ ఉందని అన్నారు. చూడాలి మరి.. కనీసం 10 లక్షలకు ఇన్సురెన్స్ ఉంటే డిపాజిటర్లకు కొంతలో కొంత మేలు జరుగుతుందనేది దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండు.