ఎంబీఏ, ఎంసీఏ ఎంట్రెన్స్​కు ఐసెట్

ఎంబీఏ, ఎంసీఏ ఎంట్రెన్స్​కు ఐసెట్

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (టీఎస్‌‌–ఐసెట్‌‌) నోటిఫికేషన్‌‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రిలీజ్​ చేసింది. ఈ ప్రకటన ద్వారా 2024 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌‌ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్​ కల్పిస్తారు. పరీక్షను వరంగల్‌‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) నిర్వహించనుంది. 

కోర్సులు :  మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)/ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

అర్హత :  ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్‌‌, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్‌‌/ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్ట్​ చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి. కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు పరిమితి లేదు.

దరఖాస్తులు :  అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో  మార్చి 7న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై, ఏప్రిల్‌‌ 30 తో ముగుస్తుంది. జూన్‌‌ 4, 5 తేదీల్లో ప్రవేశపరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం www.icet.tsche.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.