2025 మేలో జూనికార్న్స్ స్టార్టప్ ఫెస్టివల్​

2025  మేలో జూనికార్న్స్ స్టార్టప్ ఫెస్టివల్​

హైదరాబాద్, వెలుగు :  ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్ ) 2025 మే 28 నుంచి 30 వరకు అమెరికా నగరం డాలస్​లో ఐఎస్ఎఫ్ గ్లోబల్ ఏఐ సమ్మిట్  మొట్టమొదటి  అంతర్జాతీయ జూనికార్న్స్ స్టార్టప్ ఫెస్టివల్‌‌ను నిర్వహించనుంది.  ఇంటర్నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , హైదరాబాద్ (ఐఐఐగా-హెచ్)లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించింది. 

 తెలంగాణ నీటిపారుదల, ఆహార,  పౌరసరఫరాల శాఖలమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఐఎస్ఎఫ్ వ్యవస్థాపకుడు  చైర్మన్ జెఏ చౌదరి, ఐఎస్ఎఫ్ సహ వ్యవస్థాపకుడు,  మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ శివ మహేష్ టంగుటూరు కార్యక్రమంలో పాల్గొన్నారు.    ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,  ప్రతి జీవితం, ప్రతి వ్యాపారంలో ఏఐ కీలకంగా మారిందని, హైదరాబాద్‌‌ను ఏఐకి అంతర్జాతీయ కేంద్రంగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.  చౌదరి మాట్లాడుతూ 8–18 సంవత్సరాల వయస్సు ఉన్న యువ ఆవిష్కర్తల కోసం ఇంటర్నేషనల్ జూనికార్న్స్ ఫెస్టివల్  నిర్వహించనున్నామని చెప్పారు.