![వరల్డ్ కప్ ట్రయల్స్-లో ఇషాకు రెండో ప్లేస్](https://static.v6velugu.com/uploads/2025/02/isha-secures-second-place-in-world-cup-trials_lPBvai9Wec.jpg)
న్యూఢిల్లీ : వరల్డ్ కప్ ట్రయల్స్-లో తెలంగాణ స్టార్ షూటర్ ఇషా సింగ్ సత్తా చాటింది. సోమవారం జరిగిన విమెన్స్ 25మీటర్ల పిస్టల్ ఈవెంట్ ట్రయల్–1 లో ఇషా 35 పాయింట్లతో రెండో ప్లేస్ కైవసం చేసుకుంది. పంజాబ్ షూటర్ సిమ్రన్‌ప్రీత్ కౌర్ 36 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించగా.. ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్ (31) మూడో స్థానంలో నిలిచింది.