వరల్డ్ కప్స్కు.. తెలంగాణ స్టార్ షూటర్ ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌

వరల్డ్ కప్స్కు.. తెలంగాణ స్టార్ షూటర్ ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌ ఏప్రిల్‌‌లో జరిగే ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్ లో బరిలోకి దిగే 35 మంది కూడిన ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌కు ఎంపికైంది.  పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న షూటర్లందరూ ఈ మెగా ఈవెంట్లకు ఎంపికవ్వగా. డబుల్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌ మను భాకర్‌‌‌‌‌‌‌‌ జట్టుకు సారథ్యం వహించనుంది.

ఇషా విమెన్స్‌‌‌‌‌‌‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో పోటీపడుతుండగా, భాకర్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌ 10మీ. మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌ 25 మీటర్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 1 నుంచి 11 వరకు బ్యూనస్‌‌‌‌‌‌‌‌ ఎయిర్స్‌‌‌‌‌‌‌‌లో, 13 నుంచి 22 వరకు పెరూలో వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌ జరగనున్నాయి. మార్చి 14 నుంచి ఢిల్లీలోని కర్ని సింగ్‌‌‌‌‌‌‌‌ రేంజ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌కు ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ జరుగుతుంది.