జైపూర్ : టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్ (78 బాల్స్‌లో 16 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. మణిపూర్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీతో దంచికొట్టాడు. దీంతో సోమవారం జరిగిన గ్రూప్–ఎ రెండో మ్యాచ్‌లో జార్ఖండ్ 8 వికెట్ల తేడాతో మణిపూర్‌పై నెగ్గింది. టాస్ నెగ్గిన మణిపూర్ 50 ఓవర్లలో 253/7 స్కోరు చేసింది. జాన్సన్ సింగ్ (69), ప్రియోజిత్ (43), జోటిన్ (35 నాటౌట్), కర్నాజిత్ (24), బసిర్ రెహమాన్ (26) రాణించారు.
ఉత్కర్ష్ సింగ్, అనుకూల్ రాయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత జార్ఖండ్ 28.3 ఓవర్లలో 255/2 స్కోరు చేసి నెగ్గింది. ఇషాన్, ఉత్కర్ష్ సింగ్ (68) తొలి వికెట్‌కు 196 రన్స్ జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. చివర్లో కుమార్ కుశాగ్ర (26 నాటౌట్), అనుకూల్ రాయ్ (17 నాటౌట్) విజయానికి అవసరమైన రన్స్ అందించారు.
మణిపూర్ బౌలర్లలో కిషన్ సింగా రెండు వికెట్లు తీశాడు. ఇషాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచిన జార్ఖండ్ 8 పాయింట్లతో రెండో ప్లేస్‌లో కొనసాగుతోంది.