టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లోకి..ఇషాన్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో భరత్

సెంచూరియన్‌‌‌‌‌‌‌‌:  ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సౌతాఫ్రికాతో  రెండు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో అతను స్వదేశానికి వచ్చేస్తున్నాడు. దాంతో అతని స్థానంలో  కేఎస్‌‌‌‌‌‌‌‌ భరత్ టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు.  ప్రస్తుతం అతను సౌతాఫ్రికా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్న ఇండియా–ఎకు కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు.

ఆ జట్టు నుంచి భరత్‌‌‌‌‌‌‌‌ను టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లోకి చేర్చినట్టు బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ నెల 26న సెంచూరియన్‌‌‌‌‌‌‌‌లో తొలి టెస్టు మొదలవుతుంది.