SRH vs PBKS: బాల్ ఆపి బిక్క ముఖం వేసిన కిషాన్.. గ్రౌండ్‌లో నవ్వులే నవ్వులు!

SRH vs PBKS: బాల్ ఆపి బిక్క ముఖం వేసిన కిషాన్.. గ్రౌండ్‌లో నవ్వులే నవ్వులు!

ఉప్పల్ లో శనివారం (ఏప్రిల్ 12) పంజాబ్ కింగ్స్,సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో నవ్వు తెప్పించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతిని షమీ రెండో ఓవర్ లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు లెంగ్త్ డెలివరీ వేశాడు. ఈ బంతిని సిమ్రాన్ సింగ్‌ స్త్రైట్ ఆడగా.. మిడ్-ఆఫ్‌లో ఉన్న కిషన్ అద్భుతంగా బంతిని ఆపాడు. ఈ క్రమంలో బోర్లా పడిన కిషాన్ లేచి చూసేసరికి అతనికి బంతి కనబడలేదు. 

అటు ఇటు దిక్కులు చూడడమే సరిపోయింది. బంతి ఎక్కడుందో గుర్తించలేక అక్కడక్కడే బిక్క ముఖం వేసి తిరుగుతున్నాడు. దీంతో కాసేపు గందర గోల పరిస్థితులు నెలకొన్నాయి. చేసిన పనికి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు కామెంట్రీ వారు కూడా నవ్వుకున్నారు. ఇంతలో కమ్మిన్స్ వచ్చి బాల్ తీసుకొని.. బంతి ఇక్కడే ఉందని అన్నట్టు ఇషాన్ వైపు చూస్తూ సైగ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండగా.. అభిమానులు ఈ కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ ఉప్పల్ లో పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ఇచ్చిన అద్భుతమైన ఆరంభానికి తోడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్( 32 బంతుల్లో 86:6 ఫోర్లు,6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు, ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీసుకున్నారు.