సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియాకు ఒకొక్కరు దూరమవుతూ వస్తున్నారు. ఇటీవలే గాయం కారణంగా షమీ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకోగా.. తాజాగా ఇషాన్ కిషాన్ టెస్ట్ స్క్వాడ్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వలన కిషాన్ బీసీసీఐను రిక్వెస్ట్ చేయడంతో కిషాన్ ను టెస్ట్ స్క్వాడ్ నుంచి రిలీజ్ చేశారు. కిషాన్ స్థానంలో తెలుగు కుర్రాడు కేయస్ భరత్ ను వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎంపిక చేసింది.
కిషాన్ బీసీసీఐని ఏమని రిక్వెస్ట్ చేసాడో ప్రస్తావించలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా జరిగిన తొలి టెస్ట్ సిరీస్ లో వెస్టిండీస్ పై కిషాన్ మెరుగైన ప్రదర్శన చేసాడు. దీంతో సెలక్టర్లు ఈ యువ వికెట్ కీపర్ మీద నమ్మకముంచి సఫారీ టూర్ కు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ లో ఎంపికైన కిషాన్.. బెంచ్ కే పరిమితమయ్యాడు. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. ఆ తర్వాత జరిగిన రెండు టీ20 లకు ఇషాన్ కాకుండా వికెట్ కీపర్ బ్యాటర్ గా జితేష్ శర్మకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది.
ఈ సిరీస్ కు ప్రధాన వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ భారత టెస్టు జట్టులో కొనసాగుతాడు. ప్రస్తుతం భారత్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత డిసెంబర్ 26 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 3 నుంచి 7 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది.
ఇండియా టెస్ట్ స్క్వాడ్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, KS భరత్ (వికెట్ కీపర్)
? UPDATE ?: Ishan Kishan withdrawn from #TeamIndia’s Test squad. KS Bharat named as replacement. #SAvIND
— BCCI (@BCCI) December 17, 2023
Details ?https://t.co/KqldTEeD0T