భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనగానే అందరకీ గుర్తొచ్చేది.. 'కెప్టెన్ కూల్' అన్న పదం. మైదానంలో ధోని చాలా ప్రశాంతంగా ఉంటాడని, జయాపజయాల గురుంచి అస్సలు పట్టించకోడని అందరూ చెప్తుంటారు. కానీ, టీమిండియా మాజీ బౌలర్ ఇషాంత్ శర్మ అందుకు భిన్నంగా స్పందించారు. 'ధోని భాయ్.. అందరూ అనుకునేంత మిస్టర్ కూల్ కాదని, బండ బూతులు తిడతాడని తెలిపారు. ఒకసారి తాను కూడా ధోనీ ఆగ్రహానికి గురయ్యానని వెల్లడించారు.
"ధోని భాయ్‌కి చాలా బలాలు ఉన్నాయి. అయితే అవి కామ్ అండ్ కూల్ కాదు. ఫీల్డ్‌లో అతను తరచూ దుర్భాషలాడతారు. ఒకసారి నేను కూడా ఆ తిట్లు తిన్నాను. అంతేకాదు ధోనీ భాయ్ చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు. అది ఐపీఎల్ అయినా లేదా ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా. ధోనీ ఉన్నాడంటే.. అక్కడ ఊరి వాతావరణం ఉన్నట్లే. చెట్లు మాత్రమే కనిపించవు. కేవలం రాత్రి వేళ పడుకున్నప్పుడే మాత్రమే ధోనీ ఒక్కడు ఉంటారు. మిగతా సమయంలో అతని ఒంటరిగా ఉండటం జరగదు.." అని ఇషాంత్ తెలిపారు.
నన్ను ముసలాడివి అన్నారు..
'నా బౌలింగ్ పూర్తయ్యాక అలసిపోయావా..' అని మహీ భాయ్ నన్ను అడిగారు. నేను అవును అన్నాను. అప్పుడు తను.. 'కొడుకానువ్వు ముసలోడివి అవుతున్నావు.. వదిలెయ్ అన్నారు'. నాపై మహీ భాయ్ ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కానీ ఓ మ్యాచ్ లో త్రో సరిగా పట్టనందుకు తిట్టారు. మొదటిసారి కోపంగా చూశారు. రెండోసారి మరింత బలంగా త్రో వేశారు. అదీ డ్రాప్ అయింది. మూడో త్రో వేసేటప్పుడు చేత్తో కొట్టుకో అని అరిచారు.." అని ఇషాంత్.. ధోని తిట్లపురాణం గురుంచి బయటపెట్టాడు.
పేస్ బౌలరైనా ఇషాంత్.. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 105 టెస్టులు, 80 వన్డేలు ఆడిన ఇషాంత్.. వరుసగా 311, 115 వికెట్లు తీసుకున్నారు. ఇక 14 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఇషాంత్.. 8 వికెట్లు తీసుకున్నారు.