Hardik Pandya: హార్దిక్ అంటే పడి చచ్చేంత ఇష్టం.. అతన్ని ప్రేమిస్తున్నా: బాలీవుడ్ నటి

Hardik Pandya: హార్దిక్ అంటే పడి చచ్చేంత ఇష్టం.. అతన్ని ప్రేమిస్తున్నా: బాలీవుడ్ నటి

భార‌త ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాపై బాలీవుడ్ నటి మనసు పారేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్యార్ కా పంచ్‌నామా' ఫేమ్ నటి ఇషితా రాజ్ పాపులర్ ఫిల్మ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ తాజాగా హార్దిక్ పాండ్యపై తన మనసులో ప్రేమను బయటపెట్టింది. ఫిల్మిగ్యాన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ ను ప్రేమిస్తున్నానని..అతను నా అభిమాన క్రికెటర్లలో ఒకడని చెప్పుకొచ్చింది. 

ALSO READ | Vinesh Phogat: రైతుల నిరసనలో పాల్గొన్న వినేష్ ఫోగట్.. న్యాయం చేయలంటూ డిమాండ్ 

 
హార్దిక్ గొప్ప క్రికెట్ ఆల్ రౌండర్ అని.. అతని బ్యాటింగ్ చూస్తుంటే చాలా సరదాగా ఉంటుందని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజయంలో పాండ్య కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత తన విడాకుల వార్తలతో మీడియాలో మరోసారి నిలిచారు. అనన్య పాండే, జాస్మిన్ వాలియాతో డేటింగ్ లో ఉన్నారంటూ పాండ్యపై పుకార్లు వచ్చాయి. 

ఇంతకీ ఇషితా రాజ్ ఎవరు?

ఇషితా రాజ్ ప్రస్తుత వయసు 34 ఏళ్ళు. ఆమె హార్దిక్ పాండ్య కంటే నాలుగేండ్లు పెద్దది. ఢిల్లీ వాసి అయిన ఆమె ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకుంది. ఢిల్లీలోని గర్గీ కాలేజ్‌లో బీకామ్‌ పూర్తి చేసింది. ఆ తరువాత లండన్‌లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత చదువులు పూర్తి చేసింది. 2011లో ప్యార్‌కా పంచ్‌ నామా సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్థానం, యారం, జై మమ్మీ ది సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.