చిన్నప్పటి నుంచే యాక్టర్ అవ్వాలని కలలు కంటుంటారు కొందరు. అయితే నటన ఇష్టమున్నా, పేరెంట్స్ కోసం ఉద్యోగం చేసి, అది నచ్చక కొత్త దారి ఎంచుకుంటారు. మనసు చెప్పిన మాట విని, ఇష్టమైన రంగంలో స్థిరపడుతుంటారు. వాళ్లలో ఒకరు బాలీవుడ్ నటుడు ఇష్వాక్ సింగ్ కూడా. ప్రస్తుతం ‘పాతాళ్ లోక్’ సిరీస్ సీజన్–2 లో
మరోసారి ఆడియెన్స్‌ని పలకరించాడు.
చిన్నప్పటి నుంచే యాక్టర్ అవ్వాలని కలలు కంటుంటారు కొందరు. అయితే నటన ఇష్టమున్నా, పేరెంట్స్ కోసం ఉద్యోగం చేసి, అది నచ్చక కొత్త దారి ఎంచుకుంటారు. మనసు చెప్పిన మాట విని, ఇష్టమైన రంగంలో స్థిరపడుతుంటారు. వాళ్లలో ఒకరు బాలీవుడ్ నటుడు ఇష్వాక్ సింగ్ కూడా. ప్రస్తుతం ‘పాతాళ్ లోక్’ సిరీస్ సీజన్–2 లో
మరోసారి ఆడియెన్స్‌ని పలకరించాడు.
సైంటిస్ట్ పాత్రలో...
‘రాకెట్ బాయ్స్’లో గ్రేట్ సైంటిస్ట్ విక్రమ్ సారాభాయ్ పాత్రలో నటించడం చాలా సంతృప్తినిచ్చింది. ఎవరైనా సరే తాను కలగన్నది సాధించాలని చాలా తపన పడతారు. ఆ తపన, లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు ఎదురయ్యే సవాళ్లు.. ఎన్నో విషయాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి పాత్రను చేయడం గౌరవంగా భావిస్తున్నా. నిజానికి ఆ సిరీస్ కోసం ఆడిషన్స్ చేశారు. ఆడిషన్‌కి వెళ్లొచ్చిన కొద్ది టైంలోనే నాకు కాల్ వచ్చింది. కథ కూడా చాలా బాగా రాశారు. వేర్వేరు లొకేషన్లలో షూటింగ్ చేశారు. రకరకాల ప్రదేశాలు తిరిగాం. అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అవన్నీ ఆ జర్నీలో మెమొరీస్‌గా మిగిలిపోతాయి. ఈ సిరీస్ తర్వాత నాకు వచ్చిన ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను.
పాతాళ్ లోక్ – 2
‘పాతాళ్ లోక్’ సిరీస్‌కి ఇప్పుడు రెండో సీజన్ ఈనెల 17 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు సిరీస్‌లకు మధ్య చాలా గ్యాప్ ఉంది. కానీ, రెండూ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సీజన్ చూస్తున్నప్పుడు మొదటి సీజన్లో కొన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ సిరీస్‌లో జైదీప్ అహ్లవత్ వంటి పెద్ద యాక్టర్స్‌తో నటించడం హ్యాపీగా ఉంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, రెండు సీజన్లలో కలిసి ట్రావెల్ చేయడం ఎప్పటికీ గుర్తుండే ఎక్స్‌పీరియెన్స్. ఇది నా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్. ఈ సిరీస్‌లో నా క్యారెక్టర్లో చాలా లేయర్స్ కనిపిస్తాయి. అవి ఆడియెన్స్‌ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఇక నుంచి నాకు మంచి కథలు వస్తాయని నమ్ముతున్నా.
నా పర్సనల్ గ్రోత్
‘‘కెరీర్ కాకుండా సినిమాల్లో నా పర్సనల్ గ్రోత్ ఎలా ఉందంటే.. ఒక మంచి ప్రాజెక్ట్‌లో భాగం కావడం వల్ల ఎన్నో సంపాదించుకుంటామే తప్ప కోల్పోయేవి ఏమీ ఉండవు. చాలా విషయాలు నేర్చుకుంటాం. మంచి కథలో భాగం కావడం, మంచి మనుషులతో కలిసి పనిచేయడం, కో–యాక్టర్స్ ఇచ్చే సపోర్ట్.. ఇలా అన్నీ ఎక్స్‌పీరియెన్స్ చేస్తాం. ఆ ప్రభావం మనపై చాలా ఉంటుంది. ఒకవేళ మనం ఎదగలేదంటే.. దానికి కారణం మనం ఏదో తప్పు చేసి ఉంటాం అనేది నేను నమ్ముతా. డిఫరెంట్ జానర్స్, రకరకాల కథల్లో నేను యాక్టింగ్ చేశా. అలా చేస్తున్నప్పుడు నా స్కిల్స్‌ను ఒకదానికొకటి మార్చుకుంటూ ఉండాలి. అది ప్రాక్టీస్ వల్లే సాధ్యమవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. దాన్ని యాక్టింగ్‌కి అప్లయ్ చేస్తే సరిపోతుంది’’.
..కొంత టైం పడుతుంది
యాక్టింగ్ మొదలు పెట్టిన ప్రతి ఒక్కరూ స్టార్ అవ్వాలని కలలు కంటారు. కానీ, అందరూ దానికి అర్హులు కారు. నాకు నేను ఎప్పుడూ ఈ ప్రశ్న వేసుకుంటూనే ఉంటాను. నేను ఆ విధంగా చేయగలిగినప్పుడు నిజంగా నాకు అర్హత ఉందని నమ్ముతా. నేను నాటకాల్లో నటించేటప్పుడు నేను దీనికే అర్హుడినేమో అని ఆలోచించేవాడిని. నాకు అర నిమిషం ఉండే పాత్ర వచ్చినా అలాగే అనుకునేవాడిని. ప్రతి నటుడు ఫేమ్‌ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటాడు. కానీ, అన్నీ కుదరాలంటే కొంత టైం పడుతుంది. అప్పటివరకు నమ్మకంతో వేచి ఉండాలి. రాకెట్ బాయ్స్‌లో అవకాశం వచ్చినప్పుడు నేను సరైన దారి ఎంచుకున్నా అనిపించింది. ఓటీటీ అనేది ఎంతోమంది లైఫ్‌ని మలుపు తిప్పింది. అందులో నేను కూడా ఉన్నా.
ఆ నిర్ణయం సరైనదే..
ఇష్వాక్ తన యాక్టింగ్ కెరీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘నేను ఆర్కిటెక్ట్‌ని. కానీ, నాకు ఆర్కిటెక్ట్‌గా ఉండడం ఇష్టం లేదు. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండేది. యాక్టింగ్ అంటే ఎప్పుడూ ఇష్టమే. దాంతో థియేటర్ గ్రూపులో చేరాను. అక్కడే నాకు అర్థమైంది.. నేను యాక్టర్ అవ్వడానికి ఇదే సరైన సమయం అని. అది చాలా మంచి నిర్ణయం అని నమ్మాను. నా నిర్ణయానికి మా పేరెంట్స్ కూడా అడ్డుచెప్పలేదు. వాళ్లు సపోర్ట్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యా. నాటకాల్లో నటించడం వల్ల చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎన్నో స్కిల్స్ నేర్చుకున్నా. అవి సినిమాల్లోకి వచ్చాక నాకు చాలా బాగా పనికొచ్చాయి. నా మొదటి అవకాశం వచ్చినప్పుడు నాకు మాటలు రాలేదు. వచ్చింది చిన్న రోల్ అయినా.. ఆనందంతో నా మనసు ఉప్పొంగిపోయింది”అనిచెప్పుకొచ్చాడు.