సీఎం రేవంత్​ రెడ్డితో ఐసియా చైర్మన్​ భేటీ

సీఎం రేవంత్​ రెడ్డితో ఐసియా చైర్మన్​ భేటీ

హైదరాబాద్​, వెలుగు:  బలమైన మౌలిక సదుపాయాలు, శ్రామిక శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ ఎదుగుతోందని ఇండియా సెల్యూలార్ అండ్​ ఎలక్ట్రానిక్స్​ అసోసియేషన్​(ఐసియా) చైర్మన్​ పంకజ్​మహీంద్రూ అన్నారు. ఈ రంగం భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. 

సెల్‌‌‌‌కాన్‌‌‌‌ సీఎండీ వై.గురుతోపాటు తెలంగాణ సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డితో గురువారం ఢిల్లీలో పంకజ్‌‌‌‌  సమావేశమయ్యారు. సెమీకండక్టర్ ఉత్పత్తిలో తెలంగాణ గ్లోబల్ లీడర్‌‌‌‌గా ఎదగగల  అవకాశం ఉందని సీఎంకు ఆయన వివరించారు. వికసిత్‌‌‌‌ భారత్‌‌‌‌ వైపు ప్రయాణంలో తెలంగాణ కీలకం అవుతుందని చెప్పారు.