ఇరాక్, యూఎస్ దళాల దాడుల్లో ISIS అగ్రనేత హతం

ఇరాక్, యూఎస్ దళాల దాడుల్లో ISIS అగ్రనేత హతం

ఇరాక్, యూఎస్ దళాల దాడుల్లో ISIS అగ్రనేత హతమయ్యాడు. మార్చి 13న ఇరాక్ లోని అల్ అన్బార్ ప్రావిన్స్ లో జరిగిన వైమానిక దాడడిలో ఐసీస్ అగ్రనేత అబూ ఖదీజాతోపాటు మరో ఐసిస్ కార్యకర్తను మట్టుబెట్టినట్లు అమెరికా దళాలు ప్రకటించాయి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇది కీలక విజయమని వెల్లడించాయి. అబూ ఖదీజా ఐసిస్ సంస్థలు అత్యంత కీలకమైన సభ్యుల్లో ఒకరు..డీఎన్ ఏ ద్వారా అబూ ఖదీజాను గుర్తించినట్లు అమెరికా సైన్యం తెలిపింది.

ALSO READ | టెర్రరిజం ఎక్కడ పుట్టిందో అందరికీ తెలుసు

ఉగ్రవాద సంస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ ఎరిక్ కురిల్లా అన్నారు. మరణించిన ఇద్దరు ISIS సభ్యులు పేలని ఆత్మాహుతి దుస్తులు ధరించి ఉన్నారని, చాలా ఆయుధాలను కలిగి ఉన్నట్లు తెలిపారు. 

ఇక ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూడా స్పష్టం చేశారు. ఈ రోజు ఇరాక్ నుంచి పారిపోయిన ISIS  నాయకుడిని మా యుద్ద యోధులు హతమార్చారు. ఇరాకీ ప్రభుత్వం, కుర్దిష్ ప్రాంతీయ ప్రభుత్వంతో సమన్వయంతో ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టామని అమెరికా అధ్యక్షుడు ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.