ISPL 2024: మార్చి 6 నుంచి గల్లీ క్రికెటర్ల లీగ్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే

ISPL 2024: మార్చి 6 నుంచి గల్లీ క్రికెటర్ల లీగ్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే

గల్లీ క్రికెటర్లు తలపడే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ఐఎస్‌పిఎల్) ప్రారంభ ఎడిషన్ మార్చి 6 నుంచి మార్చి 15 వరకు జరగనుంది. మొత్తం ఆరు జట్లు.. మాఝీ ముంబై, బెంగళూరు స్ట్రైకర్స్, శ్రీనగర్ కీ వీర్, బెంగళూరు స్ట్రైకర్స్, చెన్నై సింఘమ్స్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ మరియు టైగర్స్ ఆఫ్ కోల్‌కతా జట్లు తొలి టైటిల్ కోసం పోటీపడనున్నాయి. 

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అనేది గల్లీ క్రికెటర్ల కోసం తీసుకొచ్చారు. దీని ప్రధాన లక్ష్యం.. గ్లోబల్ స్థాయిలో స్ట్రీట్ క్రికెట్‌ను ప్రోత్సహించడమే కాకుండా స్టేడియంలలో ఆడాలనుకునే వారి కలను నెరవేర్చడం. కాకపోతే మ్యాచ్ లు టెన్నిస్ బాల్‌తో ఆడతారు. ఐపీఎల్ తరహాలో వేలం, అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణ వంటి ఆర్భాటాలు ఉన్నాయి. ఇప్పటికే వేలం పూర్తివగా.. 96 మంది క్రికెటర్లు మొదటి ఐఎస్‌పిఎల్ కాంట్రాక్టులను పొందగలిగారు. వీరికోసం ప్రాంఛైజీలు రూ. 4.91 కోట్లు ఖర్చు చేశాయి.

రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఆడే ఈ టోర్నీలో ప్రతి జట్టు ఇతర ఐదు జట్లతో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశ ముగిసేసరికి అగ్రస్థానంలో నిలిచిన 4 జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీని టీ20 లీగ్ తరహాలోనిర్వహించనున్నారు. ఒక్కో జట్టు 10 ఓవర్ల చొప్పున.. 20 ఓవరర్లు ఆడతారు. మ్యాచ్‌లన్నీ సాయంత్రం 5 గంటలకు మరియు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రారంభ సీజన్‌లో మొదటి రోజు మినహా మిగిలిన రోజుల్లో రోజుకు రెండు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ మ్యాచ్‌లన్నీ నవీ ముంబైలోని థానేలో జరగనున్నాయి.

లైవ్ స్ట్రీమింగ్

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ 2024 సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. OTTలో టోర్నమెంట్‌ని చూడటానికి ఇష్టపడే వారు Sony Liv యాప్ లేదా sonyliv.comలో ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు. 

ఐఎస్‌పిఎల్ 2024 పూర్తి షెడ్యూల్

  • మార్చి 6: శ్రీనగర్ కే వీర్ vs మాఝీ ముంబై 
  • మార్చి 7: చెన్నై సింఘమ్స్ vs టైగర్స్ ఆఫ్ కోల్‌కతా
  • మార్చి 7: ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ vs బెంగళూరు స్ట్రైకర్స్
  • మార్చి 8: చెన్నై సింఘమ్స్ vs బెంగళూరు స్ట్రైకర్స్
  • మార్చి 8: టైగర్స్ ఆఫ్ కోల్‌కతా vs మాఝీ ముంబై
  • మార్చి 9: ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ vs మాఝీ ముంబై
  • మార్చి 9: బెంగళూరు స్ట్రైకర్స్ vs శ్రీనగర్ కే వీర్
  • మార్చి 10: మాఝీ ముంబై vs చెన్నై సింఘమ్స్
  • మార్చి 10: ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ vs టైగర్స్ ఆఫ్ కోల్‌కతా
  • మార్చి 11: టైగర్స్ ఆఫ్ కోల్‌కతా vs బెంగళూరు స్ట్రైకర్స్
  • మార్చి 11: ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ vs శ్రీనగర్ కే వీర్
  • మార్చి 12: టైగర్స్ ఆఫ్ కోల్‌కతా vs బెంగళూరు స్ట్రైకర్స్
  • మార్చి 12: ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ vs శ్రీనగర్ కే వీర్
  • మార్చి 13: శ్రీనగర్ కే వీర్ vs టైగర్స్ ఆఫ్ కోల్‌కతా
  • మార్చి 13: ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సింఘమ్స్
  • మార్చి 14: సెమీ-ఫైనల్ 1
  • మార్చి 14: సెమీ-ఫైనల్ 3
  • మార్చి 15: ఫైనల్