జెరూసలెం/డిర్ అల్-బలా: గాజాపై ఇజ్రాయెల్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్‌లో 27 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఏడుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న స్కూల్‌పై గురువారం ఇజ్రాయెల్ దాడి చేసిందని పాలస్తీనా వైద్యాధికారులు తెలిపారు.
అయితే పౌరుల మధ్య దాక్కున్న టెర్రరిస్టులే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) వెల్లడించింది. టెర్రరిస్టులు స్కూల్లో మిలిటెంట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను నడిపిస్తున్నారని దాన్నే పేల్చివేశామని పేర్కొంది. గాజాలో స్కూళ్లు మిలిటెంట్లకు ఆశ్రయంగా మారాయని ఇజ్రాయెల్ కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నది.