
గాజా స్ట్రిప్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది. ఆదివారం ఉదయం గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై బాంబు వేసింది. దీంతో ఐసీయూలో ఉన్న పేషెంట్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే ఆస్పత్రిలో హమాస్ మిలిటెంట్లు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నడుపుతున్నారని, ఆ సెంటర్ టార్గెట్‌గా బాంబు దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఆ సెంటర్ నుంచే ఇజ్రాయెల్ సైన్యంపై దాడులకు హమాస్ ప్లాన్ చేస్తోందని చెప్పింది. దాడికి ముందే ఆస్పత్రిని ఖాళీ చేయాలని హెచ్చరించామంది.