హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియెహ్ హత్యకు ప్రతీకారంగా ఇరాన్, దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ పై పగతో రగిలిపోతున్నాయి. దానికి తోడు ఏప్రిలో లో బీరూట్‌లోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి కమాండర్ ఫువాద్ షుక్ర్ సహా ఏడుగురిని చంపింది చంపింది. దీనిపై ప్రతీకారాన్ని తీసుకుంటామని హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా ప్రతిజ్ఞ చేశారు.
ఈ క్రమంలో ఇరాన్ ఇజ్రాయెల్ పై ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది. ఈ యుద్ధ వాతావరణంపై అమెరికా రియాక్టయింది. యుఎస్ సిబ్బందిని, ఇజ్రాయెల్‌ను రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌లో అదనపు యుద్ధనౌకలు, ఫైటర్ జెట్‌లను మోహరించింది. అందులో భాగంగా అదనపు రక్షణ సామర్థ్యం గల క్రూయిజర్‌లు, డిస్ట్రాయర్‌లను కూడా ఏర్పాటు చేసింది.
కాగా ఏప్రిల్ లో జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ అప్పుడే ఇజ్రాయెల్ పై దాడి చేయగా అమెరికా, జోర్డాన్, సౌదీ అరేబియాతో పాటు మరికొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్ కు మద్దుతు నిలిచాయి. కానీ ఇస్మాయిల్ హనియెహ్ హత్య తర్వాత పరిస్థితులు మారిపోయాయని .. ఈ క్రమంలో అరబ్ దేశాల నుంచి ఇజ్రాయెల్ కు సహకారం లభించడం కష్టమేనని అమెరికా భావిస్తోంది