
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలపై ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రపంచ దేశాలనుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై సుంకాలు పెంచబోతున్నారు. అయితే ఓవైపు అమెరికా దిగుమతి సుంకాలు పెంచుతుంటే మరోవైపు ఈ కీలక టైంలో అమెరికాకు ఫేవర్ అయిన ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న అన్ని వస్తువులపై సుంకాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటిచింది.
డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాల ప్రకటనకు ముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజినమ్ నెతన్యాహు అమెరికాలో తయారైన వస్తువువలపై అన్ని దిగుమతి సుంకాలను రద్దు చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ అతిపెద్ద వ్యాపార భాగస్వామి అమెరికా ఉత్పత్తులపై ఇప్పటివరకు విధించిన అన్ని కస్టమ్స్ సుంకాలను ఇజ్రాయెల్ రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మత్రి బెజలెల్ స్మోట్రిచ్ తెలిపారు.
నెస్సెట్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం, ఆర్థిక, పరిశ్రమల ఆర్డర్ పై సంతకం తర్వాత వాణిజ్యం, రక్షణకు సంబంధించిన ఆర్డర్ సవరణ అమలులోకి వస్తుంది. US నుంచి వచ్చే అన్ని దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు రద్దు చేయబడతాయి.
ఇజ్రాయెల్కు అమెరికా అత్యంత మిత్రదేశం. ముఖ్యంగా వాణిజ్య భాగస్వామి. 2024లో అమెరికాకు వస్తువుల ఎగుమతి17.3బిలియన్ డాలర్లు కాగా,సేవల ఎగుమతి16.7 బిలియన్ డాలర్లుగా ఉంది.1985లో అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం ప్రకారం.. అత్యధిక భాగం ఇప్పటికే కస్టమ్స్ సుంకాలను మినహాయించింది. ఇకపై ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గించనున్నారు.
కస్టమ్స్ సుంకాల తగ్గింపు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక స్నేహాన్ని బలోపేతం చేస్తుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ తగ్గింపుతో ఇజ్రాయెల్ ప్రజలపై ఎటువంటి భారం పడదని హామి ఇచ్చింది.