ఇరాన్ పై ఇజ్రాయోల్ ప్రతీకార దాడి ..టెహ్రాన్ లో భారీ పేలుళ్లు

 ఇరాన్ పై ఇజ్రాయోల్ ప్రతీకార దాడి ..టెహ్రాన్ లో భారీ పేలుళ్లు

ఇరాన్ పై ఇజ్రాయోల్ ప్రతీకారం తీర్చుకుంటుంది.  ఇరాన్ సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని అక్టోబర్ 26న  క్షిపణులతో కరాజ్,టెహ్రాన్ లో  వైమానికి దాడులు చేసింది. టెహ్రాన్ లోని నివాసితులు పేలుళ్లు శబద్ధం వినిపించినట్లు  స్థానికులు చెప్పారు.  అయితే ఈ దాడులతో టెహ్రాన్ లో  ఎంత నష్టం జరిగిందనేదానిపై ఇరాన్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

 అక్టోబర్ 1న భారీ క్షిపణులతో  ఇజ్రాయోల్ పై ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే.. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయోలో ముందుగానే ప్రకటించింది. ఈ క్రమంలోనే  ఇరాన్ లోని టెహ్రాన్ లో సైనిక స్థావరాలే టార్గెట్ గా క్షిపణులతో దాడి చేసింది.

 అక్టోబర్ 7 నుంచి   ఇజ్రాయోల్ పై కనికరం లేకుండా దాడులు చేస్తున్నాయి. ఇరాన్  చేసిన దాడులకు ప్రతీకారంగానే  ఈ దాడులు జరుగుతున్నాయని  ఇజ్రాయోల్ సైన్యం ప్రకటించింది. దాడికి ప్రతీకార దాడి చేసే  హక్కు తమకు ఉందని ఇజ్రాయోల్ పేర్కొంది.  

మరో వైపు   ఇజ్రాయోల్ దాడితో ఉద్రిక్తత నెలకొనడంతో  ఇరాక్ అన్ని ఎయిర్ పోర్టులను మూసివేసింది.