- హెజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
- 274 మంది మృతి.. 1000 మందికిపైగా గాయాలు
జెరూసలెం: ఇరాన్మద్దతున్న మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. లెబనాన్‌లోని ఆ సంస్థకు చెందిన 300 స్థావరాలే లక్ష్యంగా సోమవారం ఎయిర్‌స్ట్రైక్ నిర్వహించింది.
బాంబుల మోతలతో హెజ్బొల్లా స్థావరాలున్న ప్రాంతాలన్నీ దద్దరిల్లిపోయాయి. ఈ దాడిలో దాదాపు 492 మంది మృతిచెందారు. 1000 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ఆరోగ్యశాఖ వెల్లడించింది. యుద్ధం స్టార్ట్అయిన అక్టోబర్ నుంచి ఇదే అత్యంత ఘోరమైన రోజుగా అభివర్ణించింది.
కాగా, దాడికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. దాడుల ఫొటోలను షేర్చేసింది. ఈ అటాక్స్కు మిలిటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవీ అనుమతిచ్చారని తెలిపింది.
రాబోయే రోజుల్లో హెజ్బొల్లాపై కఠిన చర్యలు తీసుకుంటామని హలేవీతోపాటు ఇతర ఇజ్రాయెల్ లీడర్స్శపథం చేసినట్టు పేర్కొంది. కాగా, లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ 600 మంది చనిపోయారు. ఇందులో 500 మంది మిలిటెంట్లు, 100 మంది సామాన్య పౌరులున్నారు.
ఆ ఇండ్లను ఖాళీ చేయండి.. ఇజ్రాయెల్ హెచ్చరిక
ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం లెబనాన్‌లో పేజర్ల, పేల్చివేతతో తీవ్రరూపం దాల్చింది. ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్బొల్లా శపథం చేయగా, లెబనాన్‌లోని మిలిటెంట్ స్థావరాలపై ఇజ్రాయెల్ గురిపెట్టింది.
సోమవారం దాడులకు ముందు సౌత్ లెబనాన్‌లోని ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఆ ప్రాంతంలో హెజ్బొల్లా ఆయుధాలు నిల్వ చేసిన ఇండ్లు, ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని ఆదేశించింది.
Also Read :- కేంద్ర మంత్రి గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
మిలిటెంట్సంస్థపై తాము భారీ దాడులకు దిగుతున్నట్టు ముందే హెచ్చరించింది. యుద్ధం ప్రారంభమయ్యాక ఈ తరహా వార్నింగ్స్ రావడం ఇదే తొలిసారి. కాగా, గెలీలీలోని ఇజ్రాయెల్ మిలిటరీ పోస్ట్‌పై డజన్లకొద్దీ రాకెట్లను ప్రయోగించామని హెజ్బొల్లా పేర్కొంది. హైఫాలో ప్రధాన కార్యాలయం ఉన్న రాఫెల్ రక్షణ సంస్థ ఫెసిలిటీల లక్ష్యంగా రెండోరోజు దాడి కొనసాగించింది.
హమాస్ చీఫ్ మృతి!
జెరూసలేం: హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు తీవ్ర ప్రచారం జరుగుతున్నది. చాలాకాలంగా యాహ్యా సిన్వార్ నుంచి ఎలాంటి కదలికలు లేకపోవడంతో.. అతడు సజీవంగా ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నట్లు ఆ దేశ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, సిన్వార్ చనిపోయినట్లు ఇప్పటిదాకా ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది.
ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే వార్తా సంస్థ కూడా సిన్వార్ మరణించినట్లు వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాజనితమైనవని తెలిపింది. ఇజ్రాయెల్ ఇటీవల హమాస్ సొరంగాలపై దాడులు చేసింది. వీటిల్లో సిన్వార్ ఉన్నట్లు అనుమానించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి.
ఈనేపథ్యంలో అతడు గాయపడ్డాడా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కొని ఉంటున్నాడా అనేది ఐడీఎఫ్‌కు అర్థం కావడం లేదు. మరోవైపు, హమాస్ కమాండర్ల ధైర్యాన్ని దెబ్బతీసి లొంగదీసుకోవడానికి ఇజ్రాయెలే ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చిందనే అనుమానాలున్నాయి. డిసెంబర్లో కూడా సిన్వార్ మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.