ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధ వాతారణం సంతరించుకుంది. ఇరాన్ మద్దతుగల లెబనాన్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఆదివారం ఇజ్రాయెల్ పై ఏకంగా 320 కత్యూషా రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి యుద్ధానికి కాలుదువ్వింది. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్(IDF )కి చెందిన మొత్తం 11 ప్రాంతాలపై ఆదివారం రాత్రి నిరంతరాయంగా క్షిపణుల వర్షం కురిసిందని టెల్ అవీవ్ సైతం ప్రకటించింది.
ఈ దాడులతో ఇజ్రాయెల్ దేశవ్యాపంగా 48 గంటల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి రక్షణ మంత్రి యోవ్ గాలంట్. ఇజ్రయిల్ లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రంలో విమానాలను దారి మళ్లించారు.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ భూభాగం వైపు క్షిపణులు, రాకెట్లను ప్రయోగించడానికి హిజ్బుల్లా ప్లాన్ చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. ఇజ్రాయెల్ భూభాగంలోకి డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించడం ద్వారా యూదులపైకి ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అయితే దీనిపై కచ్చితంగా తగిన సమాధానమిస్తామని హెచ్చరించారు. ఈ బెదిరింపులకు ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ పౌరులను రక్షించడానికి హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాద లక్ష్యాలపై దాడి చేస్తామని IDF తెలిపింది.