నస్రల్లా బంకర్‌‌‌‌లో బంగారం, నోట్ల గుట్టలు : బీరుట్‌‌‌‌లోని ఓ ఆసుపత్రి కింద గుర్తించిన ఐడీఎఫ్

నస్రల్లా బంకర్‌‌‌‌లో బంగారం, నోట్ల గుట్టలు : బీరుట్‌‌‌‌లోని ఓ ఆసుపత్రి కింద గుర్తించిన ఐడీఎఫ్

జెరూసలెం: ఇజ్రాయెల్ దాడుల నుంచి రక్షణ కోసం అండర్ గ్రౌండ్ బంకర్లు నిర్మించుకున్న హెజ్బొల్లా టెర్రరిస్టులు తమ సంపదను కూడా అక్కడే దాచుకున్నారట.. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఉపయోగించిన బంకర్​లో భారీ మొత్తంలో నగదు, బంగారం ఉందని  ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) వెల్లడించింది.  బీరుట్‌‌‌‌లోని ఓ ఆసుపత్రి కింద ఉన్న ఈ బంకర్‌‌‌‌ లో  500 మిలియన్ డాలర్ల(రూ.4200 కోట్లకు పైనే) విలువైన నోట్ల కట్టలు, బంగారం ఉందని చెబుతోంది. ఈమేరకు ఐడీఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ.. బంకర్ గ్రాఫిక్ ఫొటో, వీడియోను రిలీజ్ చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.." హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్  బీరుట్ నడిబొడ్డున ఉన్న అల్-సహెల్ హాస్పిటల్ క్రింద సీక్రెట్ బంకర్ నిర్మించింది. అందులో  వందల మిలియన్ డాలర్ల నగదు, బంగారం గుట్టలుగా ఉంది. దాన్ని నస్రల్లా ఎమర్జెన్సీ టైంలో ఉపయోగించేవాడు. ఆస్పత్రి కింద బంకర్ ఉన్నందున దానిపై మేం దాడి చేయబోం. ఆ డబ్బు లెబనాన్ పునరావాసం కోసం ఉపయోగించాలి.. కానీ ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు, టెర్రరిజాన్ని పెంచడానికి వాడుతున్నారు. ఇప్పటికైనా బంకర్‌‌‌‌ను తనిఖీ చేసి హెజ్బొల్లాపై చర్యలు తీసుకోవాలని లెబనీస్ అధికారులను కోరుతున్నాం"  అని డేనియల్ హగారీ పేర్కొన్నారు.

హెజ్బొల్లా ఫైనాన్స్ చీఫ్‌‌‌‌ హతం

ఇజ్రాయెల్ సోమవారం సిరియాలో వైమానిక దాడిని నిర్వహించింది. ఈ దాడిలో హెజ్బొల్లా గ్రూపుకు నిధులు సమకూర్చే ఫైనాన్స్ చీఫ్‌‌‌‌ చనిపోయినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. టెహ్రాన్ చమురు విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును హెజ్బొల్లా గ్రూపుకు బదిలీ చేస్తున్నదని హగారీ వెల్లడించారు. హిజ్బుల్లా యూనిట్ 4400కి నాయకత్వం వహించిన వ్యక్తే నిధుల బదిలీ చేస్తాడని చెప్పారు. ఈ యూనిట్‌‌‌‌కు గతంలో షేక్ సలా అని పిలువబడే మహమ్మద్ జాఫర్ క్సీర్ నాయకత్వం వహించాడని గుర్తుచేశారు. కాగా..ఇజ్రాయెల్ ఆక్రమిత పట్టణం సఫేద్‌‌‌‌పై సోమవారం రాకెట్లను ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది.  లెబనాన్ ప్రజల రక్షణలో భాగంగా ఈ దాడి చేసినట్లు పేర్కొంది.

నిధులు ఇచ్చేది ఇరానే..!

హెజ్బొల్లా కార్యకలాపాలకు ఇరాన్ ఎలా నిధులు సమకూరుస్తుందో కూడా హగారీ వివరించారు. హెజ్బొల్లాకు సిరియా నుంచి నగదు వస్తున్నదని తెలిపారు. ఇరాన్ ద్వారా బంగారం లెబనాన్‌‌‌‌లోకి రవాణా చేస్తున్నార ని చెప్పారు. ఈ రెండూ హెజ్బొల్లా ఆదాయా నికి మూలమని ఆరోపించారు. అల్- ఖర్డ్ అల్- హసన్ (ఏక్యూఏహెచ్) అనే స్వచ్ఛంద సంస్థ కూడా హెజ్బొల్లాకు నిధులు సమకూరు స్తున్నదని వెల్లడించారు. లెబనాన్​లో దీనికి 30 బ్రాంచీలు ఉన్నాయని.. ఈ కేంద్రాలను లక్ష్యంగా దాడి చేస్తామని చెప్పారు.