మాల్దీవులు వద్దు, లక్షద్వీప్‌లే ముద్దంటున్న ఇజ్రాయిల్

మాల్దీవులు వద్దు, లక్షద్వీప్‌లే ముద్దంటున్న ఇజ్రాయిల్

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మాల్దీవులు మంచి పర్యాటక ప్రాంతం. అయితే ఈ మాల్దీవ్స్ దేశంలో ఇజ్రాయిల్ పౌరులు కాలుపెట్టకుండా నిషేధం విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చట్టంలో మార్పులు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. దీనికి ఇండియన్ ఇజ్రాయిల్ ఎంబసీ స్పందించింది. మాల్దీవ్స్ కు ఎందుకు, ఇండియా లక్ష ద్వీప్ లకు వెళ్లండని ఇజ్రాయిల్ తమ దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా సూచించింది. ఇండియాలోని కొన్ని పర్యాటక ప్రాంతాల ఫొటోలను కూడా Xలో పోస్ట్ చేసింది. మాల్దీవులను ఏటా 10 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుండగా వారిలో 15 వేల మంది ఇజ్రాయిల్ పౌరులు ఉన్నారని స్థానిక మీడియా చెబుతోంది.

గాజాపై దాడులపై నేపథ్యంలో ఇజ్రాయిల్ పౌరులపై నిషేధం విధించాలన్న స్థానికుల పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోమ్‌లాండ్ సెక్యూరిటీ, టెక్నాలజీ శాఖ మంత్రి అలీ ఇసుహాన్ మీడియాకు తెలిపారు. నిషేధం విధింపు వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీంతో ఇండియాలోని ఇజ్రాయిల్ దౌత్యకార్యాలయం ఆదేశ ప్రజలకు మాల్దీవులకు బదులుగా ఇండియాలోని లక్షద్వీప్ లకు రండి అంటూ పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా గత కొద్దికాలంగా మాల్దీవులు, భారత్ లకు మధ్య కూడా దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. మాల్దీవుస్ అధ్యక్షుడు చైనా అనుకూల వైఖరి కారణంగా భారత్ ను ఆ దేశం దూరం పెడుతుంది.