Israel-Hamas ceasefire: గాజాలో కాల్పుల విరమణ.. సొంత స్థలాలకు చేరుకుంటున్న ప్రజలు

Israel-Hamas ceasefire: గాజాలో కాల్పుల విరమణ.. సొంత స్థలాలకు చేరుకుంటున్న ప్రజలు

దాదాపు 15 నెలల యుద్ధానికి తెరపడింది. ఇజ్రాయెల్, హమాస్ మద్య గాజా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.. గాజా ప్రజలు తిరిగి వారి స్వస్థలాలకు చేరుకున్నారు. నష్టాన్ని అంచనా వేసుకుంటున్నారు.  కాల్పుల విరమణ మొదటి రోజు ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్లు.. యుద్ద ఖైదీలను, బందీలను విడుదల చేశారు. 
కాల్పుల విరమణ మొదటి రోజు ఆదివారం (జనవరి 20,2025) హమాస్ , ఇజ్రాయెల్ బందీలను, ఖైదీలను విడుదల చేశారు. మిడిల్ ఈస్ట్, గాజా స్ట్రిప్‌ను ధ్వంసం చేసిన 15 నెలల యుద్ధాన్ని నిలిపివేసిన కాల్పుల విరమణ మొదటి రోజు..ముగ్గురు ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయగా ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేశారు. 
ఈ సంధి ద్వారా గాజా ప్రజలు తమ జీవితాలను పునర్నిర్మించుకునేందుకు అనుమతి లభించింది. దీంతో గాజా ప్రజలు తిరిగి స్వంత స్థలాలకు చేరుకున్నారు.. బాంబుల దాడితో ధ్వంసమైన తమ ఇండ్లు, ఆస్తుల నష్టాన్ని అంచనా వేసుకున్నారు. రిలీఫ్ ట్రక్కులు వారికి అవసరమైన సహాయాన్ని అందించాయి.