ప్రపంచ దేశాల మధ్య దౌత్య సంబంధాలు, వ్యాపారవాణిజ్యాలు, ఎగుమతులు, దిగుమతులు ఫ్రెండ్లీ నేచర్ ఏర్పాటు చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ దోహదపడుతుంది. తమ దేశాల తరుపున ఇంటర్నేషనల్ మీటింగ్స్, సమ్మిట్స్‌లో పాల్గొనడానికి ఆయా దేశాలు అధికార ప్రతినిధులను నియమించుకుంటాయి. టెక్నాలజీలో ముందంజలో ఉన్న ఉక్రెయిన్ ఓ అడుగు ముందేసి అద్భుతాన్ని సృష్టించింది.
👋 Meet Victoria Shi — a digital representative of the MFA of Ukraine, created using AI to provide timely updates on consular affairs!
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) May 1, 2024
For the first time in history, the MFA of Ukraine has presented a digital persona that will officially comment for the media. pic.twitter.com/KTtuCVR1ku
విదేశీ వ్యవహారాలు, కాన్సులర్ సమాచారం ఎప్పటికప్పుడూ మీడియాకు అందించడానికి ఇజ్రాయిల్ ఏఐతో తయారు చేసిన ఒక డిజిటల్ ప్రతినిధిని నియమించింది. ఉక్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారన్ అఫైర్స్ తరుపున ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందించడానికి విక్టోరియా షి అనే ఏఐ డివైస్ సృష్టించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా విదేశీ వ్యవహారాలపై కాన్సులర్ అప్డేట్ లను అదించడానికి ఏఐని ఉపయోగించిన దేశంగా ఉక్రెయిన్ హిస్టరీ క్రియేట్ చేసింది.