- సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన నెతన్యాహు
జెరుసలేం: హెజ్బొల్లాతో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోనుంది. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సూత్రపాయంగా ఆమోదం తెలిపారని ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాకు ఇజ్రాయెల్ దౌత్యవేత్త మైక్ హెర్జాగ్ కూడా ఇజ్రాయెల్ ఆర్మీ రేడియోలో సోమవారం ఈ విషయం తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కొన్ని అంశాలపై తేల్చాల్సి ఉందని, కొన్ని రోజుల్లోనే అది జరుగుతుందని ఆయన చెప్పారు.
అయితే.. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే.. హెజ్బొల్లాపై తగిన రీతిలో స్పందించే హక్కు తమకు ఇవ్వాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తున్నది. ఈ ఒప్పందం ప్రకారం.. దక్షిణ లెబనాన్ నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ వెళ్లిపోవాలి. కాగా.. హెజ్బొల్లాకు మద్దతు ఇస్తున్న లెబనాన్ ఈ ఒప్పందానికి ఒప్పుకుంటుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు.