ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం రోజురోజుకు ముదురుతోంది. ఇజ్రాయిల్ పై ఇరాన్ దాదాపు 300 డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి ప్రతీకార చర్యగా ఇజ్రాయిల్ ఏం చేస్తోంది అన్నదే ఇప్పడు ప్రపంచ దేశాల మదిలో ఉన్న ప్రశ్న.. ఇజ్రాయిల్ లో జరిగిన దాడికి ఇరాన్ కు ఎలా కౌంటర్ అటాక్ ఇవ్వాలో అనే ప్లాన్ తో శనివారం వార్ క్యాబినేట్ సమావేశం నిర్వహించారు. ఇజ్రాయిల్ లోని ఓ వార్తా సంస్థ రిపోర్ట్ ప్రకారం.. ఇజ్రాయిల్ ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా ఉందని,- US- నుంచి దిగుమతి చేసుకున్న F-16, F-15, F-35 ఫైటర్ జెట్లతో సహా - కౌంటర్-స్ట్రైక్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిపింది.
ఏప్రిల్ 15 న ఇజ్రాయిల్ మిలటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మాట్లాడుతూ.. ఇరాన్ దాడికి కచ్చితంగా యాంక్షన్ ఉంటుందని అన్నారు. కానీ ఎలా అటాక్ చేస్తారో? ప్లాన్ ఏంటో, ఎప్పుడ దాడి చేస్తారో చెప్పలేదు.ఇరాన్ పై ప్రతిదాడి చేయడానికి ఇజ్రాయిల్ పక్కా ప్లాన్ తో ఉందని ఆ దేశ నేతలు పదే పదే చెబుతున్నారు. ఈక్రమంలో అసలు ఏం జరుగుతుందని ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే ఇజ్రాయెల్ పై ఘోరమైన దాడి చేస్తామని బెదిరించింది. ఇజ్రాయిల్ కౌంటర్ యాక్షన్ యుద్ధానికి దారితీస్తుందని ఆ దేశ నాయకులు అనుకోవడం లేదు. కానీ ప్రపంచ దేశాలు మిత్ర పక్షాలు ఎదురుదాడికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాయి.