భారత్ గర్వించదగ్గ ముద్దుబిడ్డ రతన్ జీ: ఇజ్రాయెల్ ప్రధాని నివాళి

భారత్  గర్వించదగ్గ ముద్దుబిడ్డ రతన్ జీ: ఇజ్రాయెల్ ప్రధాని నివాళి

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్  టాటా మృతికి ఇజ్రాయెల్  ప్రధాని బెంజమిన్  నెతాన్యాహు సంతాపం తెలిపా రు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ఆదివారం ఉత్తరం రాశారు. ‘‘రతన్  టాటా మరణంతో మీరు (భారత ప్రజలు) మాత్రమే కాదు.. మేము (ఇజ్రాయెల్  ప్రజలు) కూడా బాధపడుతున్నాం.

భారత్  గర్వించదగ్గ ముద్దుబిడ్డ రతన్ జీ. ఇండియా–ఇజ్రాయెల్  దేశాల మధ్య బంధాలు బలోపేతం కావడానికి ఆయన కూడా కృషి చేశారు. మన రెండు దేశాలకు ఆయన చాంపియన్’’ అని నెతన్యాహు ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. అలాగే రతన్ జీ కుటుంబానికి తన తరపున సంతాపం తెలపాలని మోదీని ఆయన కోరారు.