బీరూట్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. యుద్ధం ఆపాలని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

బీరూట్ పై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. యుద్ధం ఆపాలని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

ఇజ్రాయెల్ దళాలు సెంట్రల్ గాజాలోని మసీదుపై బాంబు దాడి చేశాయి. ఆదివారం (అక్టోబర్ 6) జరిగిన ఈ దాడుల్లో 21మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. దాడులు పెరుగుతుండటంతో ఉత్తర గాజా ప్రాంతంలో పౌరులను ఖాళీ చేయింది సైన్యం.  

మరోవైపు లెబనాన్ రాజధాని బీరూట్ బాంబుల దాడి జరిగింది. ఇజ్రాయెల్ సైన్యం బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాలపై కొత్తగా దాడులు చేసింది. 

ALSO READ | మసీదుపై ఇజ్రాయెల్ ఆర్మీ బాంబుల వర్షం.. 21 మంది మృతి

మరోవైపు గాజాపై యుద్ధాన్ని ముగించాలని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పారీస్ నుంచి న్యూయార్క్ కేప్ టౌన్ వరకు పదివేల మంది ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. 

అక్టోబర్ 2023 నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 41వేల 870 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడుల్లో 1139మంది మృతిచెందారు. 200మంది పైగా బందీలుగా పట్టుకుపోయారు.