జెరూసలెం: ఇజ్రాయెల్ బందీల్లో కొంత మందినైనా విడుదల చేయడానికి హమాస్ ఒప్పుకుంటే గాజాలో యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. రంజాన్ పండుగ రానున్న నేపథ్యంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య మరో వారం రోజుల్లో ఈ దిశగా ఒప్పందం కుదురుతుందని తాను ఆశిస్తున్నట్లు ఓ టీవీ ఇంటర్వ్యూలో బైడెన్ చెప్పారు. ‘‘రంజాన్ మాసంలో కాల్పులకు పాల్పడబోమని ఇజ్రాయెల్ ఇంతకుముందు ఒప్పందం చేసుకుంది” అని బైడెన్ గుర్తుచేశారు.
అయితే, బైడెన్ కామెంట్లపై ఇజ్రాయెల్ స్పందించలేదు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. మార్చి 10న రమదాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విమరణ ఒప్పందం జరగవచ్చని భావిస్తున్నారు.