గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ​23 మంది మృతి

గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ​23 మంది మృతి

డెయిర్​అల్​బలాహ్: 8 వారాల సీజ్​ఫైర్​ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్​ విరుచుకుపడింది. బుధవారం గాజా పరిసర షిజాహియా ప్రాంతంలో ఓ బిల్డింగ్‎పై వైమానిక దాడి చేసింది. బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో మొత్తం 23 మంది పౌరులు మృతిచెందినట్టు పాలస్తీనా హెల్త్​ మినిస్ట్రీ వెల్లడించింది. ఇందులో 8 మంది మహిళలు, 8 మంది చిన్నారులు ఉన్నట్టు తెలిపింది.  నాలుగు అంతస్తుల భవనాన్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్​ దాడిచేసిందని, ఈ భవనం శిథిలాల కింద బాధితుల కోసం రెస్క్యూ బృందాలు వెదుకుతున్నాయని  పేర్కొన్నది. అలాగే, చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్​ కూడా దెబ్బతిన్నాయని తెలిపింది.