
టెల్అవీవ్: గాజా స్ట్రిప్‌కు మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. నిత్యావసర వస్తువులు, అత్యవసర సప్లై ఎంట్రీని నిలిపివేసింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 1న ముగిసింది. రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఏప్రిల్ 20 వరకు కాల్పుల విరమణను పొడిగించాలని ఇజ్రాయెల్ ప్రతిపాదించింది.
అయితే, దీనికి హమాస్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే గాజాకు మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకున్నట్లు తెలుస్తున్నది. రెండోదశ కాల్పుల విరమణపై రెండు పక్షాలు సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఈ ఒప్పందం కుదిరితే, ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే, ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను తిరిగి అప్పగించాలి.
కాగా.. అంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందాలను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తున్నదని, అందుకే రెండో దశ కాల్పుల విరమణకు తాము ఒప్పుకోవడం లేదని హమాస్ పేర్కొంది.