గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. శనివారం (అక్టోబర్ 19) జరిగిన ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడుల్లో 33 మంది మరణించారు. మృతుల్లో 21 మంది మహిళలు ఉన్నారు. ఈ దాడిలో 85 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్యమరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 42వేల 500మంది మృతిచెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ALSO READ | యుద్ధం ఆపేస్తేనే బందీలను అప్పగిస్తం: తేల్చి చెప్పిన హమాస్
మరోవైపు ఇజ్రాయెల్ పై సిరియా దాడికి ప్రయత్నించింది. సిరియా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) ప్రకటించాయి. సిరియా డ్రోన్ల ద్వారా దాడులకు ప్రయత్నించింది. అవి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించకముందే కూల్చివేశామని తెలిపారు.